మోదీ చర్యలకు జై కొడుతున్న విద్యా బాలన్

Update: 2016-11-21 11:05 GMT

బాలీవుడ్ లో యవ్వన దశలో తన ఉనికిని కాపాడుకోవటానికి తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొన్న కథానాయిక విద్య బాలన్ మధ్య వయస్కురాలిగా తనకు తగ్గ పాత్రలను పోషిస్తూ బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ది డర్టీ పిక్చర్, పా, కహాని వంటి వాణిజ్య అంశాలకు దూరంగా వున్న కథలను ఏరి కోరి తీసుకుని తన నటనతో ప్రేక్షకులని అలరించటమే కాకుండా మిడ్ ఏజ్ లో ఎన్నో పురస్కారాలను దక్కించుకుంది విద్య బాలన్.

అయితే కొంత కాలంగా మీడియా దృష్టికి దూరంగా ఉంటున్న విద్య బాలన్, ఎందరో సెలబ్రిటీ స్టేటస్ వున్న సినీ ప్రముఖులు స్పందించటానికి సంశయిస్తున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి విలేకరులతో తన అభిప్రాయాన్ని ధైర్యంగా పంచుకుంది. బాలన్ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి పూర్తి మద్దతుని తెలిపారు. ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు తాత్కాలికమని, అవి ఎదుర్కోక తప్పదు అని మరో ప్రత్యాన్మాయం కోసం ఆర్.బి.ఐ సవరణలు చేసినా చేయకపోయినా వచ్చే నెలలో పరిస్థితులు చక్కబడటం ఖాయం అని విద్య బాలన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News