మోదీ చర్యను సమర్ధించి ప్రజాగ్రహానికి గురైన మెగాస్టార్

Update: 2016-11-23 19:00 GMT

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధించిన ఎందరో సెలబ్రిటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మౌనం వహిస్తుండగా, ఇప్పటి వరకు స్పందించని వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడే వారు కాదు అని ఇప్పటికైనా సామాన్యులు అవస్థ పడకుండా ఈ చర్యలో సవరణలు చెయ్యాలని చెప్తుండగా మోలీవుడ్ మెగా స్టార్ మోహన్ లాల్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వున్నారు. ఆయన ఇవాళ్టి కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలో ఎటువంటి లోపం లేదు అని నరేంద్ర మోదికి సంపూర్ణ మద్దతుని సోషల్ మీడియాలో తెలియజేసారు.

మోహన్ లాల్ పెద్ద నోట్ల రద్దు విషయమై స్పందిస్తూ, "సినిమా టిక్కెట్లకు, వైన్ షాపుల వద్ద, ఆలయాల్లో దైవ దర్శనాలకి క్యూ లైన్లలో వేచివున్నప్పుడు కలగని కష్టం ఇప్పుడు బ్యాంకులలో ఎ.టి.ఎం వద్ద నిలబడితే మాత్రం కలుగుతుందా? ఈ చర్య తాత్కాలిక అపోహలతో ఆగేది కాదు. దీర్ఘ కాలిక ప్రయోజనాలు సామాన్య ప్రజలకే మేలు చేస్తాయి." అని ట్వీట్ చేశారు. అయితే కేరళ రాష్ట్రంలోనే బ్యాంకుల వద్ద తోపులాటలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మోహన్ లాల్ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు అని మీడియా తో పాటు కేరళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో మోహన్ లాల్ అభిమానులు కూడా ఉండటం గమనార్హం.

Similar News