మెగా స్టార్ వెయిట్ చెయ్యక తప్పేలా లేదు

Update: 2016-11-22 06:25 GMT

మెగా స్టార్ చిరంజీవి తన వెండి తెర కమ్ బ్యాక్ మూవీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఖైదీ నెం. 150 చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో 2017 సంక్రాంతి పండుగ బరిలో దించటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇటీవల పాట చిత్రీకరణ కోసం విదేశీ షెడ్యూల్ కూడా ఒకటి పూర్తి చేసుకుని వచ్చింది చిత్ర బృందం. ఈ చిత్రం తరువాత రాజకీయ వ్యవహారాలతో పాటు వరుస సినిమాలకు సమయం కేటాయిస్తానని మెగా స్టార్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసేసారు.

కొంత కాలం క్రిందట ఖైదీ నెం. 150 స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా బోయపాటి శ్రీను చిరంజీవికి ఒక కథ చెప్పి మెగా స్టార్ నుంచి ఆమోదం కూడా పొందాడు. ఖైదీ నెం. 150 చిత్రీకరణ గ్యాప్లో బోయపాటి శ్రీను తాను అప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం చెయ్యాల్సి ఉండగా ఆ చిత్రీకరణ ప్రారంభించారు కానీ అది అనివార్య కారణాల వలన సజావుగా సాగక వాయిదాలు పడుతుంది. దీనితో 2017 వేసవి వరకు బోయపాటి కి బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంతోనే సరిపోతుంది.

గీత ఆర్ట్స్ నిర్మాణ సారధ్యంలో చేయనున్న మెగా స్టార్- బోయపాటిల చిత్రం ప్రారంభం కావటానికి చిరు సంక్రాంతి పండుగ నుంచి 2017 జూన్ వరకు అయినా వెయిట్ చెయ్యాల్సి వచ్చేలా వుంది. చిరు ఆగుతాడో లేక ఈ గ్యాప్ లో ఇతర దర్శకులలో ఎవరికైనా అవకాశం కలిపిస్తారో చూడాలి.

Similar News