మెగా మూవీ ఛాన్స్‌‌పై గుర్రుమంటున్న కాజల్

Update: 2016-11-11 10:10 GMT

చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 లో హీరోయిన్ గా చిరంజీవి పక్కన సెలక్ట్ కాగానే కాజల్ అగర్వాల్ ఎగిరి గంతేసినంత పని చేసింది. అప్పటికి కాజల్ చేతిలో సినిమాలు లేక ఖాళీగా కూర్చున్న టైం లో కాజల్ కి ఖైదీ లో చిరు పక్కన చెయ్యడం చాలా సంతోషాన్నిచ్చింది. కాజల్ అంతమందు నటించిన సినిమాలు 'సర్దార్...., బ్రహ్మ్మోత్సవవం' చిత్రాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆ సినిమాలు ప్లాప్ అవడం తో కాజల్ పని ఖాళీ అన్నారు అంతా.. అయితే ఖైదీ లో కాజల్ చేయదనే అనుకున్నారంతా. ఎందుకంటే చిరుకి 60 ఏళ్ళు వయసుంటుంది. మరి అంత ఏజ్ గ్యాప్ ఉన్న చిరుతో చేస్తే కాజల్ కెరీర్ కి దెబ్బ అవుతుందని భావించారు. కానీ కాజల్ చిరు పక్కన నటించడానికి ఒప్పుకుని అందరికి షాక్ ఇచ్చింది. ఒప్పుకోక ఏం చేస్తుంది ఎలాగూ సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

ఇక కాజల్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించడం వల్ల పెద్దగా హ్యాపీ గా లేదట. ఎందుకంటే కాజల్ లుక్ ని ఖైదీ ప్రొమోషన్ కి సంబంధించి ఇంతవరకు విడుదల చెయ్యలేదు. ఇక చిరు లుక్ మీద మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసారని అంటుందట. పోనిలే హీరోకే ఎక్కువ ఇంపోర్టన్స్ ఉంటుంది కదా... అందులోను చిరు కదా అని కొంచెం తగ్గినా... ఇప్పుడు ఐటెం సాంగులో నటించే లక్ష్మి రాయ్ కి సంబందించిన విషయాలను మాత్రం మీడియాతో పంచుకుంటున్నారు..... కానీ కాజల్ విషయాలేమి మీడియాకి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతున్నారు చిత్ర యూనిట్ వాళ్ళు. మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న తనని పట్టించుకోకుండా ఐటెం లో కనిపించే లక్ష్మి రాయ్ కి మాత్రం ఎక్కువ ఇంపోర్టన్స్ ఇస్తున్నారని కొంచెం కోపంగా ఉందని విశ్వసనీయ సమాచారం.

Similar News