మెగా ఫ్యామిలీ కుర్రాళ్ళు అంతా ఒకే ఫొటోలో...! అవునండి చిరంజీవి దగ్గర నుండి సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ ఒకే ఫ్రేమ్ లో పెట్టేసారు. మెగా ఫ్యామిలీకి పెద్ద అయిన చిరంజీవి ఒక సోఫాలో కూర్చుని ఒక వైపు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మరో వైపు మేనల్లుడు సాయి ధరమ్ తేజ మరో పక్క రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నాగబాబు, వైష్ణవ్ తేజ్, నీహారిక కూర్చుని ఒక అదిరే ఫోటో కి ఫోజిచ్చారు. నిన్న జరిగిన దీపావళి సందర్భం గా వీరంతా స్పెషల్ గా ఈ ఫోటోకి ఫోజిచ్చారు. ఇక ఈ ఫొటోలో మీరు బాగా గమనించారో లేదో చిరు చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎక్కడా కనబడలేదు. మామూలుగానే పవన్ ఎవరితో కలవడు. ఇక కలిసినా కూడా ఇలా ఫోటోలు దిగడనే రూమర్ ఉండనే వుంది.
ఇక మెగా ఫ్యామిలీ ఎప్పుడూ చిరంజీవి ఇంటికి వెళ్లి పండగలు సెలెబ్రేట్ చేసుకోవడం అలవాటు. కానీ ఈసారి ఈ దీపావళి పండగ వేడుకలు నాగబాబు ఇంట్లో జరిగినట్లు సమాచారం. మీరు గమనించారో లేదో ఈ ఫొటోలో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కాలుకు కట్టు కట్టుకుని కనిపించాడు. ఆ మధ్యన శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ షూటింగ్ స్పాట్ లో వరుణ్ కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ వరుణ్ కి సూచించారు. సో అదీ కట్టు అన్నమాట. ఇక కదలలేని పరిస్థితిలో వున్నా వరుణ్ చిరు ఇంటికి వెళ్లడం కుదరదు గనక అంతా కలిసి నాగబాబు ఇంట్లో కలిశారు. అందుకే మెగా ఫ్యామిలీ ఈసారి నాగబాబు ఇంటికి వెళ్లి దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారని అంటున్నారు. మరి పవన్ చిరు ఇంటికి రాకపోయినా కనీసం చిన్న అన్న నాగబాబు ఇంటికైనా వెళ్లాల్సిందని అంటున్నారు. అయినా నాగబాబు ఈ మధ్యన పవన్ పై రుసరుసలాడుతున్నాడు. ఎందుకంటే చిరంజీవిని పవన్ పట్టించుకోవడం లేదని.... పవన్ ఒక్కడేనా మెగా హీరో మేమంతా లేమా అని.... ఒకసారి ఫ్యాన్స్ కి క్లాస్ కూడా పీకాడు. అందుకే పవన్ ఈ దీపావళి వేడుకలకి హాజరవలేదని అంటున్నారు. ఇంతకీ అక్కడ అసలు విషయం ఏమి ఉండదు... కానీ బయటి వాళ్ళు మాత్రం వంద రకాలుగా ఊహించుకుని ఏవేవో అల్లేస్తుంటారు. మరి వాళ్ళందరూ బాగానే కలిసిమెలిసి వుంటారు. ఫ్యామిలీ అన్నాక ఏదో చిన్న చిన్న గొడవలు రాక మానవు... మళ్ళీ కలవక మానరు.