మారుతి- శర్వానంద్ కాంబినేషన్లో చిత్రం

Update: 2016-11-03 15:54 GMT

ఒకే ఒక్క సినిమా ప్లాప్ అయితే ఆ డైరెక్టర్ ని అందరూ ఏ విధం గా అంచనా వేస్తారు. ఇక ఆ సినిమాతో ఆ డైరెక్టర్ పని పోయిందనీ.... ఇక స్టార్స్ తో చేసే అవకాశం కోల్పోయాడనో అంటుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు డైరెక్టర్ మారుతి. పాపం మారుతి పరిస్థితి ఆగమ్య గోచరం గా వుంది. బాబు బంగారం ప్లాప్ తో మారుతి పని అయిపొయింది. ఇక స్టార్ హీరో లు ఎవరూ మారుతికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. అందుకే ఈమధ్య ఒక కుర్ర హీరో ని డైరెక్ట్ చెయ్యడానికి ఒప్పుకుని అతని నుండి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అయితే మారుతి కి ఆ హీరో తో చెయ్యడం ఇష్టం లేక ఆ సినిమా ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంటే ఆ హీరో డైరెక్టర్ మారుతితో గొడవ పడినట్లు వార్తలొచ్చాయి.

ఈ గొడవలలా ఉండగా.... ఇప్పుడు మళ్ళీ మారుతి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. మారుతి ప్రస్తుతం ఒక స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ స్క్రిప్ట్ కి హీరోగా శర్వానంద్ ని ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ దిల్ రాజు ప్రొడక్షన్ లో శతమానం భవతి చిత్రం లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఇక ఆ సినిమాతో పాటు శర్వా చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉందని సమాచారం. ఇక ఈ రెండు సినిమాల తర్వాత శర్వానంద్ మారుతి డైరెక్టన్ లో చేస్తాడని చెబుతున్నారు. మరి ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే మారుతి మళ్ళీ గాడిలో పడ్డట్లే. లేకుంటే మాత్రం మరో చిన్న హీరోని ఎతుక్కోవాల్సిన పరిస్థితి మారుతికి ఏర్పడుతుంది.

Similar News