మనసు ప్రేమను కోరుతోంది అంటున్న నాయిక

Update: 2016-11-09 13:37 GMT

నేనూ అమ్మాయినే కదా.. నా మనసు ప్రేమను కోరుకుంటోంది.. జీవితంలో అసలైన మగాడు దొరికితే ఇలానే వుంటుందేమో..... అంటూ పెద్ద షాక్ ఇచ్చింది బాలీవుడ్ కుర్ర హీరోయిన్ ఆలియా భట్. బాలీవుడ్ లో చాలా చిన్న వయసులో అడుగుపెట్టిన ఆలియా భట్ అతి కొద్దికాలం లోనే మంచి హీరోయిన్ గా ఎదిగింది. ఇంత చిన్న కెరీర్ లోనే ఆమెకు చాలామంది తో ఎఫ్ఐర్స్ ఉన్నవైనంటూ తెగ వార్త హల చల్ చేశాయి బాలీవుడ్ లో. అయితే ఆ వర్తకాన్ని కొట్టిపారేసింది ఆలియా. ఇక ఇప్పుడు ఆమె చేసిన ఈ తాజా వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో పడేశాయి.

ఆలియా అసలైన మగడు దొరికితే ఇలానే ఉంటుందేమో అనేసరికి ఇక ఆలియా ఎవరితోనో ప్రేమలో పడిందని అనుకుంటున్నారు. మరి ప్రేమలో పడకపోతే ఇలాంటి మాటలు మాట్లాడదు కదా... అని దీర్గాలు తీస్తున్నారు. తాజాగా ఆలియా సీనియర్ హీరో షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ సినిమాలో చాల ముదురు హీరో పక్కన వయసులో చిన్నదైనా ఆలియా నటిస్తుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆలియా మనసులో ఎవరూ లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యదు కదా? ఉంటే ఎవరై వుంటారబ్బా ..! అని అందరూ తెగ ఆలోచిచ్చేసున్నారు.

Similar News