దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలం నట జీవితంలో అన్ని దక్షిణాది భాషల్లో నటిస్తూ కథానాయికగా చాలా సుదీర్ఘ ప్రయాణమే చేసింది మద్రాస్ బ్లాక్ బ్యూటీ త్రిష క్రిష్ణన్.తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయకులు ఐన చిరంజీవి, బాల క్రిష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, ప్రభాస్, రవి తేజ, గోపి చంద్, కమల్ హాసన్, అజిత్ లాంటి పెద్ద హీరోల సరసన నటించేసిన త్రిష ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటూ మార్కెట్ పరంగా క్రేజ్ తగ్గినా, అవకాశాలు విషయంలో మాత్రం కొదవ లేదు.
తమిళంలో నిన్న విడుదల ఐన కోడి చిత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం తెలుగులో ధర్మ యోగిగా నేడు విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన త్రిష, తొలి సారి కెరీర్లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించింది. కోడి చిత్రంలో హీరో ధనుష్ అయినప్పటికి కథలో కీలకమైన మలుపులు అన్ని త్రిష పాత్ర ద్వారానే చోటు చేసుకుంటాయి. ఈ పాత్రలో త్రిష అద్భుతమైన నటనను ప్రదర్శించి విమర్శకులకు పని లేకుండా చేసింది. ఈ పాత్రలో త్రిష ను చేతే ఆవిడకి మరిన్ని అవకాశాలు తలుపు తట్టటం ఖాయంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం త్రిష మోహిని అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ముందు ముందు ఇటువంటి చిత్రాలు చేస్తుందో లేక కోడి లో చేసిన నెగటివ్ పాత్రల దారి పడుతుందో చూడాలి.