మంగళంపల్లి  మరణాన్ని కూడా వదలని వర్మ

Update: 2016-11-23 18:19 GMT

ఎటువంటి పరిణామాన్ని అయినా వివాదాస్పదంగా మార్చగలిగిన ఏకైక సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మ. ఆయన మత గురువులను, రాజకీయ దిగ్గజాలను, పురాణాల పాత్రలను ఇలా అన్నింటిపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుని అనేక సార్లు వివాదాలకు దారి తీశారు. భారతీయుల భావోద్వేగాల తో తనకు పని లేదు అని చెప్పిన ఏకైక దర్శకుడు కూడా రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన సంగీత దిగ్గజం మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారి మరణం పై స్పందించి మరో సారి వార్తల్లో నిలిచారు.

"నా బాల్యం నుంచి పాశ్చాత్య సంగీతాన్ని ఎక్కువ ఆస్వాదించేవాడిని. ప్రాచీన, సాంస్కృతిక, కర్ణాటక సంగీతాల గురించి కానీ, మంగళంపల్లి బాల కృష్ణ మురళి సాధించిన ఘనత గురించి కాని నాకు అవగాహన లేదు. బాక్, బీథోవెన్, మోజారితో సంగీతం మాత్రం దశాబ్దాల కాలం గా నన్ను అలరిస్తుంది." అని ట్వీట్ చేశారు ఆర్.జీ.వి. కళా తపస్వి విశ్వనాధ్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు లాంటి దర్శకులే మంగళంపల్లి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని, వారి సంతాపాన్ని తెలియజేసిన తరుణంలో వర్మ వ్యక్తిగత అభిప్రాయానికి సంగీత ప్రియులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News