ఇద్దరు సూపర్ స్టార్స్ తో మణిరత్నం తెరకెక్కించిన మల్టీ స్టార్రర్ దళపతి నుంచి రోజా, బొంబాయి, సఖి, కడలి వంటి పలు మణిరత్నం చిత్రాలతో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అరవింద్ స్వామి. ఆయన కథానాయకుడి పాత్రలతో అలరించి సుదీర్ఘ కాలం విరామం తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ ప్రతి నాయకుడి పాత్రల్లో మెప్పిస్తున్నారు అరవింద్ స్వామి. తన్ని ఉరువన్ రీమేక్ గా ధ్రువ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులను రీప్లేస్ చేయగలిగారు గాని ప్రతినాయకుడిగా మాత్రం అరవింద్ స్వామి ని రీప్లేస్ చెయ్యలేక ఆయనతోనే ఆ పాత్ర తెలుగులోనూ నటింపజేశారు.
ప్రస్తుతం అరవింద్ స్వామి తమిళ చిత్రం చతురంగ వెట్టో 2 చర్చల దశను దాటుకుని నటీనటుల ఖరారు చేసుకుంటుంది. ఈ చిత్రంలో కీలక భూమికను ప్రముఖ కథానాయిక త్రిష పోషించనుండగా, అరవింద్ స్వామి సరసన నటించే నాయికగా దర్శక నిర్మాతలు పూర్ణ కు ఓటు వేశారు. ఇప్పటికే పూర్ణ ఈ చిత్రంలో నటించటం దాదాపు ఖరారు ఐయ్యింది. తెలుగులోనూ పూర్ణ నటించిన తాజా చిత్రం జయమ్ము నిశ్చయమ్ము చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయం దిశగా అడుగులు వేస్తుంది. అవును ఫెమ్ తో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న పూర్ణకు అరవింద్ స్వామి చిత్రంతో తమిళంలోనూ నిరూపించుకునేందుకు మంచి ప్లాటుఫార్మే దొరికింది.