బేతాళుడు ఇంత ధీమాగా వస్తున్నాడంటే??
అక్కినేని నాగ చైతన్య పోయిన శుక్రవారం తన సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని విడుదల చెయ్యటాన్ని సినీ పండితులు అందరూ అది పెద్ద సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. అప్పటికి చాలా మందికి అది అర్ధం కాకపోయినా చిత్రం విడుదల ఐన మరుసటి రోజుకి అర్ధం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సాహసం శ్వాసగా సాగిపో చేసిన వసూళ్లు కేవలం రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయల షేర్ మాత్రమే. సినిమా చుసిన వారి నుంచి మంచి స్పందనే వస్తున్నా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సగటు ప్రేక్షకుడి దగ్గర చెలామణిలో కరెన్సీ లేకపోవటం ఇందుకు కారణం. చైతు తిన్న ఎదురు దెబ్బ తాను తినకూడదు అని జాగ్రత్త పడుతున్నట్టు వున్నాడు రామ్ చరణ్ తేజ్. అసలే బ్రూస్ లీ డిసాస్టర్ తరువాత వస్తున్నా ధ్రువ విజయం తనకి చాలా కీలకం.
ధ్రువ చిత్రాన్ని డిసెంబర్ 2 న విడుదలకు సిద్ధం చేసే దిశగా ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నా, ప్రస్తుత సామాన్య మానవుడి ఆర్ధిక పరిస్థితి ఇంకా కుదుటపడకపోవటంతో ఆలస్యం ఐన పరవాలేదు కానీ ఓపెనింగ్స్ మిస్ కాకూడదు అని నిశ్చయించుకున్నారు అంట ధ్రువ అండ్ టీం. అయితే డిసెంబర్ nelalone మరో విడుదల తేదీ ప్రకటిస్తారా లేక జనవరి కి వెళ్ళిపోతారా అనేది తెలియాల్సి వుంది. ఈ క్రమంలో డిసెంబర్ 2 న తమిళ అనువాద చిత్రం ఐన బేతాళుడు విడుదలను ఖాయం చేసుకున్నారు నిర్మాతలు. డిసెంబర్ ద్వితీయార్ధంలో నేను లోకల్, దంగల్ వంటి చిత్రాలు ఉండటంతో డిసెంబర్ మొదటి వారమే సేఫ్ అని బేతాళుడి వ్యూహం.
ఇక జనవరి వరకు ఆగటం చిన్న సినిమాలకు అందులోనూ అరవ అనువాదాలు కష్టం. చిరంజీవి 150 వ చిత్రం, బాల కృష్ణ 100 వ చిత్రం విడుదలలు ఎప్పుడో సంక్రాంతికి నిర్ణితమై థియేటర్స్ కూడా బ్లాక్ అయిపోయాయి.J