బుర్రిపాలెం రూపురేఖలు మార్చిన శ్రీమంతుడు

Update: 2016-10-27 12:44 GMT

కథానాయకుడిగా నిలదొక్కుకోవటానికి ఎవరైనా కమర్షియల్ సూత్రాలతో నిండిన కథలే ఏరి కోరి ఎన్నుకుని, వాటినే బలం నమ్మి ప్రయాణం మొదలుపెడతారు. ఆలా కొంత కాలానికి సమయం సందర్భం చూసుకుని స్టార్ స్టేటస్ చక్రంలో నుంచి బైటకి వచ్చి కొన్ని కథలను ఒప్పుకుంటుంటారు అగ్ర స్థాయి కథానాయకులు. సందేశాత్మక ఆలోచనతో తయారు ఐన కథకి రీచ్ ఎక్కువ ఉండాలన్నా ఆ కథకి స్టార్ హీరో తోడు అవ్వాల్సిందే. అలా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రమే శ్రీమంతుడు. గ్రామాల దత్తత అనే ఘట్టాన్ని కమర్షియల్ శైలిలో చెప్పి ఎందరినో ఆలోచింపచేశారు కొరటాల శివ మరియు అతని సైన్యం.

శ్రీమంతుడు కథ తన దగ్గరకు రాకముందే గ్రామాల దత్తత తీసుకునే యోచనలో ఉండేవాడిని అని ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆలోచనను వెలిబుచ్చాడు. అప్పటికే శ్రీమంతుడు చిత్రం విడుదల కావటంతో ఇదేదో సినిమా ప్రచారం అని తీసిపారేసిన వారు లేకపోలేదు. కానీ మహేష్ బాబు తన బావ ఐన లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ సహాయ సహకారాలతో ఆయన దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామపు రూపు రేఖలనే మార్చేశాడు. నూతనంగా నిర్మితమైన కాంక్రీట్ డ్రైన్ వాల్స్, సిసి రోడ్ ఫోటోలు సామాజిక మాంద్యమం ద్వారా ప్రేక్షకులతో పంచుకుని గల్లా జయదేవ్ కు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు మహేష్.

మహేష్ బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బుర్రిపాలెం అనే గ్రామంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న సంగతి విదితమే.

Similar News