బిచ్చమెత్తుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

Update: 2016-11-11 12:44 GMT

మస్తానీ గా గత సంవత్సరం ప్రేక్షకులను తన నటన, అందాలతో కట్టిపడేసిన దీపికా పదుకునే భారతీయ చిత్రాలతో పాటు విదేశీ చిత్రాలలోనూ అవకాశాలు అంది పుచ్చుకుంది. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది దీపికా పదుకునే. ఈ చిత్రంలో ఫాస్ట్ అండ్ ఫురియస్ స్టార్ విన్ డీజిల్ తో కలిసి నటిస్తోంది దీపికా. ఈ చిత్రం 2017 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విదేశీ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ బాలీవుడ్ చిత్ర నిర్మాతలకు తన కాల్ షీట్ లు అందుబాటులో వుండే లా జాగ్రత్త పడుతుంది దీపికా.

అయితే తాజాగా సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం పొందుతున్న దీపికా పదుకునే చిత్రాలు చూసి అభిమానులు కంగుతింటున్నారు. మాసిపోయి చిరిగిపోయిన దుస్తులతో, చెదిరిన జుట్టుతో, చేతిలో నలిగిన బట్టల మూటతో దర్శనమిస్తోంది . ప్రస్తుతం దీపికా ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిదీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర విశేషాలు ఏవి బైటకు రాలేదు. అయితే దీపికా ప్రస్తుత గెట్ అప్ ఆ చిత్రానికి సంబంధించినదే అయి ఉండచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఆమె బిచ్చగత్తె పాత్ర పోషిస్తున్నదేమోనని ఈ చిత్రాలు చూసిన వాళ్లు అనుకుంటున్నారు. మరి ఆ చిత్రాల వెనుక వున్న కథను దీపికా స్వయంగా ఎప్పుడు చెప్తుందో చూడాలి.

ఈ రెండు చిత్రాలతో పాటు తనకు రామ్ లీల గోలియామ్ కి రాసలీల, బాజీరావు మస్తానీ వంటి రెండు సంచలనాత్మక విజయాలు ఇచ్చిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో పద్మావతి అనే హిందీ చిత్రంలోనూ దీపిక నటిస్తోంది.

Similar News