హీరో రాంచరణ్ శ్రీమతి అయిన ఉపాసన బాలికా నిలయంలో బతుకమ్మ ఆడారు. తన అమ్మమ్మ నిర్వహించే బాలికా నిలయంలో బతుకమ్మ వేడుకల్లో ప్రతి ఏటా తల్లితో కలిసి పాల్గొనడం , అక్కడి అందమైన అమ్మాయిలతో కలిసి బతుకమ్మ ఆడడం ఉపాసనకు అలవాటు. ఆ సాంప్రదాయం కొనసాగింపుగానే ఈ ఏడాది కూడా అమ్మమ్మ నిర్వహించే అనాథ శరణాలయం.. బాలికా నిలయంలో.. ఉపాసన అందరితో కలిసి బతుకమ్మ ఆడారు.
‘‘ఇక్కడ అమ్మాయిలే బతుకమ్మను తయారుచేయడంలో కూడా మాకు సాయపడ్డారు. మేం ప్రతి సంవత్సరం ఈ వేడుక ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం. ఇది అంత ఉత్సాహభరితంగా జరుగుతుంది. ఎందుకంటే.. ఇది మాకు , ఇక్కడి అమ్మాయిలకు కూడా జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులు పంచుతుంటుంది.. నేను వారితో కలసిమెలిసి ఉంటూనే పెరిగాను.. వారి మొహాల్లో ఆనందం చూడడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది’’ అని కార్యక్రమం తర్వాత ఉపాసన చెప్పారు.
బాలికా నిలయంలో తాను నిర్వహించిన బతుకమ్మ వేడుకల గురించి ఆమె సోషల్ మీడియా లో కూడా రాసుకున్నారు.