హ్యాపీ డేస్ వంటి సంచలన విజయం తర్వాత యువత తో ఓ మోస్తరు విజయం ఖాతాలో వేసుకున్నా, హ్యాపీ డేస్ స్థాయి విజయం నమోదు చెయ్యటానికి నిఖిల్ కి దాదాపు సగ పుష్కరం పట్టింది. 2012 లో విడుదల ఐన స్వామి రారా చిత్రం నిఖిల్ కి సోలో హీరోగా స్థాయి పెంచిన చిత్రం. ఆ విజయానికి కొనసాగింపుగా వెనువెంటనే కార్తికేయ, సూర్య vs సూర్య తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆణిముత్యం ఐన శంకరాభరణం అనే టైటిల్ వాడి మేజిక్ రీ క్రియేట్ చేస్తానన్న కోన వెంకట్ ట్రాప్లో పడి చేతులు కాల్చుకున్నాడు నిఖిల్.
శంకరాభరణం వైఫల్యం నుంచి బైటకి రావటానికి నిఖిల్ కి ఏడాది సమయం పట్టింది. ఆ వైఫల్యం తనలో పెంచిన కసి ని బాగా నమ్మినట్టున్నాడు ఈ యువ హీరో. అందుకే వైఫల్యాలతో సతమవుతున్న దర్శకులతో పని చెయ్యటానికే మొగ్గు చూపుతున్నాడు. వారు కూడా విజయం సాధించటానికి అదే కసితో పని చేస్తారని నిఖిల్ ధీమా ఏమో. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాన్ని టైగర్ చిత్రంతో నిరాశ చెందిన వి.ఐ.ఆనంద్ కి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తనకు గుర్తుండిపోయే విజయాన్ని స్వామి రారా తో అందించిన సుధీర్ వర్మతో పని చేస్తున్నాడు. సుధీర్ వర్మ కూడా నాగ చైతన్య దోచేయ్ సినిమా తో ఎదురు దెబ్బ తిని ఇప్పుడు నిఖిల్ సినిమా అవకాశం దక్కించుకున్నాడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది.