ప్చ్! నాగ్‌ది కేవలం గెస్ట్ రోలేనంట!!

Update: 2016-11-02 06:21 GMT

నాగార్జున ఓం కార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తాడని మీడియాలో ఒకటే న్యూస్. ప్రస్తుతం నటిస్తున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం కంప్లీట్ కాగానే నాగార్జున ఓం కార్ డైరెక్షన్ లో చేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా 'రాజుగారి గది 2' గా ఉంటుందని.... ఈ చిత్రం పివిపి బ్యానర్ లో తెరకెక్కుతోందని చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బయటికి వచ్చింది. పివిపి కోసమే నాగార్జున ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించి నట్లు వార్తలొస్తున్నాయి. అయితే 'ఊపిరి' వంటి హిట్ ఇచ్చిన పివిపి బ్యానర్ కోసం నాగార్జున ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడనే వార్తలొస్తున్నాయి.

ఓం కార్ డైరెక్షన్ లో వచ్చిన 'రాజుగారి గది' సినిమాలో ఓం కార్ తమ్ముడు లీడ్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పుడు వచ్చే పార్ట్ 2 లో కూడా ఓం కార్ తమ్ముడు అశ్విన్ లీడ్ రోల్ లో కనిపించనున్నాడని... ఇంకా ఈ సినిమాలో నాగసౌర్య, రాజ్ తరుణ్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఇక నాగ్ కేవలం గెస్ట్ పాత్రకే పరిమితమని ప్రచారం మొదలైంది. అంటే పివిపి ఋణం తీర్చుకోవడానికి నాగ్ ఇలా గెస్ట్ రోల్ ఒప్పుకున్నాడని అంటున్నారు.

Similar News