పేరు ఖరారు కాకముందే విడుదల తేదీ ఖరారు

Update: 2016-11-30 05:47 GMT

మన తెలుగు చిత్రాల కథానాయకులకు మన తెలుగు రాష్ట్రాలు ధాటి బైటకి వెళ్తే మార్కెట్ అసలు లేదు అనే చెప్పాలి. అల్లు అర్జున్ లాంటి ఒకరిద్దరు కథానాయకులు ఇందుకు మినహాయింపు. కానీ హాలీవుడ్, బాలీవుడ్ తారలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం జరుగుతుంటుంది. అందుకే మన చిత్రాల విడుదల తేదీలు ఆఖరి క్షణం వరకు కూడా కొన్ని సందర్భాలలో సందిగ్ధంలోనే వుంటుంటాయి. కానీ ఆంగ్ల చిత్రాలు, హిందీ చిత్రాలు చిత్రీకరణ ప్రారంభం నాటికే విడుదల తేదీ ఖరారు ఐయ్యి అధికారిక ప్రకటన కూడా వెలువడిపోతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు సర్దుబాటుకు ముందు నుంచే ప్రణాళికతో సిద్దమవటం పంపిణీదారులకు వీలుపడుతుంటుంది.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం డియర్ జిందగీ విడుదలై వారం రోజులు గడవకముందే షారుఖ్ ఖాన్ తన నిర్మాణంలో నటిస్తున్న తదుపరి చిత్రం 2017 ఆగష్టు 11 న విడుదల కానున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ప్రకటించారు. రెడ్ చిల్లీస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో లవ్ ఆఙ్కళ్ ఫేమ్ ఇంతియాజ్ అహ్మద్ అలీ ఖాన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించబోయే చిత్రం ప్రారంభం కానుంది. ఇంకా ఈ చిత్రానికి పేరు ఖరారు చేయలేదు. షారుఖ్ సరసన అనుష్క శర్మ కథానాయికగా నటిస్తుంది. రబీ నే బాణాది జోడి, జబ్ తక్ హై జాన్ తరువాత ఈ జంట తెరపై కలిసి కనిపించనున్న చిత్రం ఇదే కావటం తో ఇప్పటినుంచే షారుఖ్ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

Similar News