పాపం హిట్ కోసం విలవిల్లాడుతున్నాడు!!

Update: 2016-11-01 13:42 GMT

గత మూడేళ్లుగా తాను నటించిన నాలుగు చిత్రాలు బాగా ఆడలేదు. దీంతో రణబీర్‌కపూర్‌ చిక్కుల్లో పడ్డాడు. ఆయనకు ఇప్పుడు అర్జంట్‌గా ఓ హిట్‌ కావాలి. కాగా ఆయన హీరోగా నటించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంపై ఆయనతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటించిన ఐశ్వర్యారాయ్‌ తన 42ఏళ్ల వయసులో కూడా తన కంటే చిన్నవాడైన రణబీర్‌కపూర్‌తో పాటు లిప్‌లాక్‌లు చేసి, ఇంకా సినిమా నిండా హాట్‌హాట్‌ అందాలతో కనువిందు చేయడం చర్చనీయాంశం అయింది. దీంతో ఈ చిత్రంపై శృంగార ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మరోపక్క ఈ చిత్రానికి దర్శకుడు కరణ్‌జోహార్‌ దర్శకుడు కావడంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగురోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఇండియాలో కంటే ఓవర్‌సీస్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదంతా కరణ్‌జోహార్‌కు ఓవర్‌సీస్‌లో ఉన్న క్రేజ్‌ పుణ్యం. ఇక వరుసగా సెలవులు రావడం ఈ చిత్రానికి మరింత ప్లస్‌ అయింది. ఇదే ఊపులో మరో వారం రోజులు కనుక ఈ చిత్రం థియేటర్లలో నిలబడితే రణభీర్‌కపూర్‌కు ఉన్న ఒకే ఒక్క హిట్‌ కోరిక కూడా నెరవేరుతుందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. మరి ఒకే ఒక్కవారం రణబీర్‌ భవిష్యత్తును తేల్చనుందని అంటున్నారు.

Similar News