పాపం అందరిలాగే ఆశపడుతోంది!!

Update: 2016-11-19 10:53 GMT

బోణీ అంటూ టాలీవుడ్‌ తోనే సినీ రంగానికి బోణీ కొట్టిన బ్యూటీ కృతి కర్బందా. ఆ తర్వాత తెలుగు.. కన్నడ సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ కంటిన్యూ చేసింది కానీ.. శాండల్‌ వుడ్‌ లోనే సెటిల్‌ అయిపోయే వరకూ వచ్చేసింది. కానీ బ్రూస్‌ లీలో రామ్‌ చరణ్‌కి అక్కగా నటించడం.. ఆ తర్వాత బాలీవుడ్‌లో రాజ్‌ రీబూట్‌ లో చేయడంతో.. కృతి రేంజ్‌ మారిపోతుందనే అనుకున్నారు. బాలీవుడ్‌ రాజ్‌ రీబూట్‌ ఫ్లాపైనా కూడా.. అమ్మడిని అక్కడోళ్ళు బాగా ఈవెంట్లకు పిలుస్తున్నారు. బ్లాక్‌ కలర్‌ మినీ ఫ్రాక్‌ లో.. రీసెంట్‌ గా ఓ ఈవెంట్‌ సందడి చేసింది. నడుం దగ్గర కిటికీ ఓపెన్‌ చేసి మరీ నడుం అందాలను చూపిస్తోంది.

కాసింత పొదుపు పాటిస్తున్న క్లీవేజ్‌ షో విషయంలోనూ లోటు చేయలేదు. మినీ ఫ్రాక్‌ కావడంతో.. కాలి సోకులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ అందానికి పాపం హిట్‌ పడట్లేదు. అయితే.. ఇలా ఈవెంట్లు ఫోటో షూట్స్‌తో అయినా.. బాలీవుడ్‌ లో కుదురుకునే అవకాశం చిక్కుతుందనే ఉద్దేశ్యంతో.. వేటినీ వదలకుండా కంటిన్యూ చేస్తోంది. అసలు ఈ గ్లామర్‌ కు ఒక్క హిట్‌ పడితేనా.. స్టోరీ మారిపోతుంది అంతే.ప్రస్తుతం మాస్తిగుడి అనే కన్నడ సినిమాలో నటిస్తుంటే.. ఆ మూవీ షూటింగ్‌ లో ఇద్దరు టెక్నీషియన్స్‌ చనిపోవడం కారణంగా.. ప్రాజెక్ట్‌ సందిగ్ధంలో పడింది. అతిథి ఇన్‌ లండన్‌ అనే హిందీ సినిమాలో చేస్తోంది. అదయినా హిట్‌ అవుతుందని బోలెడన్ని హోప్స్‌ పెట్టుకుంది కృతి కర్బందా.

Similar News