' ఏమైంది ఈ వేళ', 'రచ్చ, బెంగాల్‌టైగర్' వంటి మూడు చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంపత్‌నందికి పవన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం చేతల వరకు వచ్చి మిస్సయిపోయింది. అయినా తన 'బెంగాల్‌టైెగర్' చిత్రంలో పవన్‌పై తన డైలాగులతో అభిమానులు ఈలలు వేయించే డైలాగ్స్ రాసి, వావ్.. అనిపించాడు. కాగా ప్రస్తుతం సంపత్‌నంది గోపీచంద్ హీరోగా పుల్లారావు, భగవాన్ నిర్మాతలుగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి కూడా పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని పాటలో వచ్చే 'వీడు ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్‌ను గోపీచంద్ చిత్రానికి పెట్టాలని నిర్ణయించాడట. ఈ విషయమై ఆయన 'ఆరడుగుల బుల్లెట్' పదాన్ని టైటిల్‌గా పెట్టడానికి ఆ చిత్ర హీరో పవన్‌తో పాటు దర్శకనిర్మాతలను కూడా సంప్రదించి ఆమోదం పొందాడనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.