సక్సెస్ రేట్ బాగా తక్కువ వుండే పరిశ్రమల్లో ప్రధాన స్థానం చలన చిత్ర పరిశ్రమది. పరాజయం చెందిన ప్రతి చిత్రానికి ఆర్ధిక పరమైన పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు, పంపిణిదారులు, ప్రదర్శకులు నష్టపోవటం సర్వ సాధారణం. కాని వైఫల్యానికి గల నిందలు నిర్మాతలపై కన్నా దర్శకులు, కథానాయకులు పై తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తంలో చిత్ర విజయాపజయాలకు కథానాయికలకు ఏ మాత్రం సంబంధం లేదు. కాని పరిచయ చిత్రం వైఫల్యం చెందినప్పటికీ అదృష్టవ శాత్తు తదుపరి అవకాశాలు దక్కించుకోగలిగే కథానాయికలు చాలా అరుదుగా వుంటారు. ఆ చిత్రాలు కూడా పరాజయం చెందితే విజయాపజయాలను ప్రభావితం చెయ్యలేని పాత్ర అయినప్పటికీ ఐరన్ లెగ్ ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది కథానాయికలకు.
కథానాయికలకు వరుసగా చిత్రాలు విజయం పొందుతుండటం, ఆ చిత్రాలతో వారికి గుర్తింపు రావటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ విషయంలో హెబ్బా పటేల్ చాలా అదృష్టవంతురాలు. ఇప్పటికి ఆమె నటించిన నాలుగు తెలుగు చిత్రాలు విడుదల కాగా అన్ని చిత్రాలు విజయవంతమయ్యాయి. హెబ్బా పటేల్ పరిచయ చిత్రం ఆలా ఎలా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి చిన్న చిత్రాలలో పెద్ద విజయమే సాధించింది. హెబ్బా తరువాత సుకుమార్ రచన లో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ తో ఇక వెనుతిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలతో బిజీ అయిపోయింది. ఈ ఏడాది వేసవికి విడుదల ఐన ఈడో రకం ఆడో రకం తో పాటు తాజాగా విడుదల ఐన ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా భాగారి విజయం దిశగా పయనం చేస్తుంది.
చిత్రీకరణ దశలో హెబ్బా పటేల్ కి మరో మూడు చిత్రాలు ఉండగా సంతకం చెయ్యాల్సిన చిత్రాలు మరి కొన్ని వున్నాయి. వచ్చిన ప్రతి అవకాశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక, ఆచి తూచి పాయాత్రలను ఎంచుకుంటే దశాబ్దం పాటు హెబ్బా పటేల్ నట జీవితం కొనసాగే అవకాశం వుంది. లేదా ఎంత త్వరగా ఫామ్ లోకి వచ్చిందో అంతే త్వరగా ఫేడ్ అవుట్ ఐపోనూ వచ్చు.