‘నో మేకప్’ను ప్రమోట్ చేస్తున్న కత్రినా

Update: 2016-11-26 11:55 GMT

సినిమా తారల ముఖాలను మేకప్ లేకుండా చూడడం అంటే ఎవ్వరూ పెద్దగా ఇష్టపడరు. అసలు అలా ఊహించుకోవడానికే ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే మేకప్ లేకుండా అభిమానుల ముందుకు రావడానికి స్టార్స్ కూడా సాహసించరు. అలాంటిది నో మేకప్ ట్రెండ్ అంటూ ఒక బాలీవుడ్ తార తన పబ్లిసిటీ ని మొదలుపెట్టింది. ఒక మేగజైన్ కవర్ పేజీ కోసం కత్రినా కైఫ్ మాల్దీవ్స్ దాకా మూడు విమానాలు మారి... 12 గంటలు ప్రయాణం చేసి మరీ నో మేకప్ ట్రెండ్ కోసం ఫొటోలకి ఫోజులిచ్చింది. ఇక అక్కడ దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ ఫోటో లో కత్రినా వైట్ బికినీలో మేకప్ లేకుండా మెరిసిపోతూ మరీ ఫోజిచ్చింది. నాచురల్ లుక్ తో ఆ మ్యాగజైన్ కోసం కత్రినా ఫోటోలకు ఫోజులిచ్చింది. అసలు సినిమా స్టార్స్ ని మేకప్ లేకుండా చూడలేం అనే దానికి చెక్ పెడుతూ మ్యాగజిన్ కవర్ పేజీ మీద కత్రినా మేకప్ వేసుకోకుండా ఫోటోలకు ఫోజిచ్చింది. మరి కత్రినా ఇలా మేకప్ లేకుండా ఫోజిచ్చాక మిగతా హీరోయిన్స్ కూడా ఇలాగే మేకప్ లేకుండా ట్రై చేస్తారేమో చూద్దాం..!

Similar News