నాటి హరిణి కి నేటి శంకర్ ఎవరు

Update: 2016-10-09 10:56 GMT

దక్షిణ భాష చిత్రాలలో ప్రవేశమే శంకర్ వంటి భారీ చిత్రాల దర్శకుడి దర్శకత్వంలో జరిగింది జెనీలియా డి సౌజ కు. బాయ్స్ చిత్రంలో ఆవిడ పోషించిన హరిణి పాత్రతో తెలుగు తమిళ భాషలలో తన నట ప్రస్తానం ప్రారంభం ఐయింది. తన సమకాలీన నటీమణులు అయినటువంటి త్రిష, నయనతార, శ్రీయ శరన్ లలా వయసు ముప్పైలలో పడే వరకూ పెళ్లి ఊసు ఎత్తకుండా చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానానికి చేరుకోలేదు. తెలుగులో దగ్గుబాటి వెంకటేష్, తారక్ వంటి మేటి నటులతోనే కాక, రాజమౌళి దర్శకత్వంలోనూ నటించిన ఈ భామ అవకాశాలు చేతి నిండా ఉన్న రోజులలోనే వ్యక్తిగత జీవితానికి సమయం, ప్రాధాన్యం ఇచ్చింది.

జెనీలియా తెలుగు తమిళ చిత్రాలే కాక హిందీ చిత్రాలలోనూ వరుస అవకాశాలు అంది పుచ్చుకుంది. జానే తుయా జానే నా విజయం తర్వాత నటించిన తేరే నాల్ లవ్ హోగయా చిత్రంలో తన సహ నటుడు ఐన రితేష్ దేశముఖ్ ని నిజ జీవితంలో ప్రేమించి వివాహమాడింది. వివాహ అనంతరం అడపా దడపా అతిధి దర్శనాలు తప్ప ప్రధాన పాత్రలు పోషించలేదు జెన్నీ. కొంత కాలం క్రితం బిడ్డకు తల్లి ఐన జెన్నీ ఇప్పుడు తన పుత్రుడు అయాన్ దేశముఖ్ కొంచం పెద్ద వాడు కావటంతో మళ్లీ తన నట జీవితం ప్రారంభించాలనే తన కోరికను కొంత కాలం క్రితమే వ్యక్త పరిచింది. కానీ ఇప్పటి వరకూ ఏ దర్శక నిర్మాతలు జెన్నీ ని సంప్రదించలేదు. ఇప్పుడు ఏ దర్శకుడు జెన్నీ ని తెరపై చూపించే శంకర్ అవుతారో??

సినిమా అవకాశాలు ఇంకా తన తలుపు తట్టనప్పటికీ ముంబై నగరంలో లవ్ జనరేషన్ అనే దుస్తుల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా యాజమాన్యం వారు జెనీలియాను ఆహ్వానించారు. శనివారం ఆ దుకాణం ప్రారంభ వేడుకలలో మెరిసింది జెన్నీ.

Similar News