నాగ్‌కు మెమొరబుల్ హిట్లిచ్చాడు.. చైతూకు ఇస్తాడా?

Update: 2016-10-13 09:29 GMT

టాలీవుడ్ చిత్రాల్లో సంగీతదర్శకుల్లో ఇప్పుడు ఎవరి హవా బీభత్సంగా నడుస్తూ ఉన్నప్పటికీ మెలోడీ బ్రహ్మగా పేరున్న మణిశర్మకు ఉన్న క్రేజ్ వేరు. అందరు అగ్రహీరోలకు భారీ హిట్‌లు ఇచ్చిన మణిశర్మ ఇటీవలి కాలంలో.. తెలుగు పరిశ్రమలో కొత్తనీరు పెరిగిన తర్వాత.. తక్కువగా కనిపిస్తున్నారు. కానీ కనిపించినప్పుడెల్లా మంచి సంగీతంతో మెరిపిస్తున్నారు. మురిపిస్తున్నారు.

తాజాగా నాగచైతన్య హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వారాహి వారు నిర్మించే చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి నాగార్జున కు మణిశర్మ ఎన్ని మెమొరబుల్ హిట్ సాంగ్స్ ఇచ్చాడో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు కొడుకు చైతూ సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

ప్రస్తుత తరం దర్శకులలో గొప్ప కథకుడి గా గ్రహణం చిత్రంతో పేరు తెచ్చుకుని తర్వాత వాణిజ్య అంశాలతో కూడిన కథలనే తెరకెక్కిస్తూ ఆప సోపాలు పడుతూ కెరీర్ నడిపిస్తున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ. బంది పోటు వరకు తన చిత్రాలకు కళ్యాణ్ మాలిక్ (కళ్యాణ్ కోడూరు) కే సంగీతం సమకూర్చే బాధ్యతను అప్పగిస్తూ వచ్చాడు .

జెంటిల్ మాన్ చిత్ర విజయంలో పాటలు, నేపధ్య సంగీతం ఎక్కువ తోడ్పడ్డాయి. సినిమా చివరి రెండు రీళ్ల వరకు కూడా ఉత్కంఠను రేకెత్తించే కథలోని సన్నివేశాలను శిఖర స్థాయిన నిలబెట్టిన ఘనత నేపధ్య సంగీతానికే దక్కుతుంది. అది అంతా మణిశర్మ మాయాజాలమే. సుదీర్ఘ విరామం తర్వాత స్వర బ్రహ్మ మణిశర్మ తన అభిమానులను అలరించిన ఆల్బం జెంటిల్ మాన్. ఆ చిత్ర సక్సెస్ దర్శకుడికి సంగీత దర్శకుడికి ఇద్దరికీ కమ్ బ్యాక్ చిత్రంగా నిలిచింది.

Similar News