నాకేం తెలియదు అంటున్న శృతి

Update: 2016-11-02 12:09 GMT

క‌మ‌ల్ హాస‌న్, గౌత‌మిలు విడిపోయిన విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కాగా గౌతమి, కమల్ హాసన్ నుండి విడుపోవడం వెనుక ఉండలేక పోవడం అన్నది ప్రధానాంశంగా తెలుస్తుంది. ఊహించని ఈ పరిణామానికి ఎవరు కారణం అన్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తే.. శ్రుతి హాసన్ అన్న విషయం టక్కున మదిలో మెదిలే సమాధానం. ఆ విధంగా గౌతమిపై అభిమానులందరికీ సానుభూతి పెరిగిపోతుంది. కమల్, గౌతమి ఇద్దరూ విడిపోవడానికి కారణం శ్రుతిహాసనేనంటూ సినీ వర్గాల్లో చర్చరేగుతుంది. ఈ విషయంపై క‌మ‌ల్ హాస‌న్ కూడా ఎటువంటి స్పందనా తెలపకపోవడం విశేషం.

అయితే ఈ విషయంపై కమల్ మాట్లాడుతూ... గౌత‌మి త‌న నిర్ణ‌యం తాను తీసుకొంది, అందులో ఏముంది ఇక చెప్పడానికి అంటూ తన సన్నిహిత మీడియా ప్రతినిధుల వద్ద వెల్లడించినట్లుగా తెలుస్తుంది. కాగా వీరిద్దరూ విడిపోవడానికి కారణంగా చెప్పుకుంటున్న శ్రుతి హాసన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “ఎవరి వ్య‌క్తిగ‌త జీవితం వారిది. అటువంటి విష‌యాల్లో నేను జోక్యం చేసుకోను. వారు తీసుకున్న నిర్ణ‌యంపై నేను కామెంట్స్ చేయడం పద్ధతిగా ఉండదు. నా త‌ల్లిదండ్రులు, నా సోద‌రి అంటే నాకు గౌర‌వం, ప్రేమ‌. వాళ్ల విషయాలు త‌ప్ప మ‌రొకరి విష‌యం గురించి నాకు అన‌వ‌స‌రం” అంటూ వెల్లడించింది శ్రుతి హాసన్.

Similar News