బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ను ఎప్పుడెప్పుడు వెండితెర మీద హీరోగా చూద్దామా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే హీరోగా మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. అయితే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే చిత్రం వచ్చే ఏడాది ఆఖర్లో సెట్స్ మీదకెళ్లనుందని చెబుతున్నారు. ఇక ఏ డైరెక్టర్ అయితే మోక్షజ్ఞ ని హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ చేయగలడో అని బాలకృష్ణ ఎప్పటినుండో ఆలోచిస్తున్నాడట. మోక్షజ్ఞ ఎంట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిపోయేలా చెప్పుకోవాలని... అందుకే రాజమౌళి వంటి డైరెక్టర్ చేతిలో మోక్షజ్ఞని పెట్టాలని బాలయ్య మొదట భావించాడట. ఇక తర్వాత త్రివిక్రమైన బాగానే ఉంటుందని అనుకున్నాడట. అయితే వీరిద్దరూ మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే చిత్రాన్ని వేరే డైరెక్టర్ తో గనక ఇప్పిస్తే... మోక్షజ్ఞ రెండో చిత్రాన్ని తాము డైరెక్ట్ చేస్తామని బాలయ్యకి మాటిచ్చారట.
ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ని భారీ లెవల్లో చేయాలనుకుంటున్న బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటిని రంగంలోకి దింపాలని అనుకున్నాడట. కానీ ఎందుకో ఏమో ఇప్పుడు బాలయ్య ఆలోచనలు మారినట్లు చెబుతున్నారు. తన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ క్రిష్ అయితే మోక్షజ్ఞ ఎంట్రీని పర్ ఫెక్ట్ గా చేయగలడని నమ్మి క్రిష్ చేతులో మోక్షజ్ఞ ని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక క్రిష్ వర్క్ నచ్చి బాలయ్య ఈ డెసిషన్ తీసుకున్నాడని చెబుతున్నారు. అంతేకాకుండా మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మాణాన్ని సాయి కొర్రపాటికి అప్పగించాడట. ఇక క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని పక్కాగా చెబుతున్నారు.