తొలిప్రేమ తొలి వారాంతం ఎంత కొల్లగొట్టిందో తెలుసా?

Update: 2018-02-12 09:40 GMT

ఫిదా వంటి ఫ్యూర్ లవ్ స్టోరీతో హిట్టుకొట్టి మళ్ళీ అదే జోనర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా చేసాడు. సినిమా పూర్తి స్థాయి ప్రేమ కథగా... రొటీన్ కథ అయినప్పటికీ వెంకీ అట్లూరి చేసిన మ్యాజిక్ తో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా గత శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లోను సత్తా చాటుతుంది. మొదటి రోజు ఓకె ఓకె అనిపించేలా 5 కోట్ల షేర్ ని తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా 9.26 కోట్ల షేర్ ని రాబట్టింది. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కే కాకూండా రాశి ఖన్నా కి కూడా మంచి విజయాన్ని అందించడమే కాదు... డైరెక్టర్ వెంకీ అట్లూరికి అయితే మంచి అవకాశాలు తలుపుతట్టేలా చేస్తుంది. మరి తొలిప్రేమ తొలి వారాంతం ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా ఎంత కొల్లగొటిందో చూసేద్దామా...

ఏరియాల వారీగా తొలిప్రేమ వీకెండ్ కలెక్షన్స్ కోట్లలో

నైజాం: 2.3

తూర్పు గోదావరి: 0.48

పశ్చిమ గోదావరి: 0.44

ఉత్తరాంధ్ర: 0.86

కృష్ణా: 0.53

గుంటూరు: 0.62

నెల్లూరు: 0.23

సీడెడ్: 0.73

టీఎస్ మరియు ఏపీ కలిపి: 6.96 కొట్లు

యూఎస్: 2.30 కోట్లు

రెస్టాఫ్ ఏరియాస్: 0.75 కోట్లు

తొలిప్రేమ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 9.26 కోట్లు

Similar News