తమ్ముడు తమ్ముడే.. పొగడ్తలు పొగడ్తలే

Update: 2016-10-30 01:30 GMT

కాష్మోరా చిత్రం తో కార్తిలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసాడు డైరెక్టర్ గోకుల్. ఇప్పటి ఇవరకు కార్తీ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చేసిన కాష్మోరా చిత్రం మాత్రం కార్తీ గత చిత్రాలకు పూర్తి భిన్నం గా ఉంటుంది. ఈ చిత్రం తో కార్తీ అటు తమిళం లో ఇటు తెలుగులో హిట్ కొట్టేసాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో కార్తీ నటనకు ఒక హీరో ముగ్దుడైపోయి విషెస్ తెలియజేసేసాడు. అతనెవరో కాదు విభిన్న పాత్రలకు పెట్టింది పేరైన కార్తీ అన్న సూర్య. సూర్య కి కాష్మోరాలో కార్తీ నటన, అతని కేరెక్టర్ చాలా బాగా నచ్చాయట. కాష్మోరా చిత్రం లో కార్తీ రెండు రోల్స్ ప్లే చేసాడు. ఒకటి రాజనాయక్ గా మరొకటి కాష్మోరాగా.... ఈ రెండు కేరెక్టర్స్ సూర్యని బాగా ఇంప్రెస్స్ చేశాయట.

ఇక కార్తీ నటనను చూసిన సూర్య నేను ఇంకా చాలా నేర్చుకోవాలి లేకుంటే మా తమ్ముడి కంటే నేను వెనకబడిపోతానను... అలాగే తమిళం లో ఎప్పుడూ చూడని ఒక కొత్త లోకాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసారు. కాష్మోరా చిత్రం లో రాజనాయక్, రత్న మహాదేవి వున్న సీన్స్ అదిరిపోయేలా ఉందని... ఇలాంటి చిత్రాన్ని అందించిన కాష్మోరా యూనిట్ కి నా అభినందనలు అంటూ సూర్యా ట్వీట్ చేసాడు. మరి తమ్ముడి నటన గొప్పదనంపై అన్న సూర్య ఈ విధం గా పొగడ్తల వర్షం కురిపించేసాడు. ఇక సూర్య అనటం కాదుగాని కార్తీ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించేసాడని అంటున్నారు ప్రేక్షకులు.

Similar News