జేజమ్మకు ఏమవుతోంది?

Update: 2016-10-22 12:43 GMT

నిన్నటివరకు తెలుగులో నెంబర్‌వన్‌ హీరోయిన్‌ ఎవరంటే అందరూ ఠక్కున అనుష్క పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్దితులు మారుతున్నాయి. హీరోయిన్లు సీనియారిటీ పెరిగేకొద్ది, అందం తరిగే కొద్ది సినిమా అవకాశాలను కోల్పోతారు. దానికి విరుద్దంగా తమిళంలో నయనతార నడుస్తోంది. కానీ టాలీవుడ్‌లో మాత్రం రాను రాను టాప్‌హీరోయిన్‌గా వెలుగొందిన అనుష్క సీన్‌ మాత్రం మారుతోంది. ఈ ఏడాది ఆమె 'సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి' చిత్రాలలో గెస్ట్‌ రోల్స్‌ చేసింది. 'సైజ్‌ జీరో' తర్వాత ఆమె నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు. కానీ ఈ డిసెంబర్‌ నుండి మాత్రం అనుష్క వరసగా నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. సూర్యతో చేస్తున్న 'సింగం3', 'బాహుబలి2', 'భాగమతి', చిత్రాలతో పాటు ఆమె సన్యాసినిగా చిన్న పాత్ర చేస్తున్న నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతోంది.

అయితే ఇకపై అనుష్కను కమర్షియల్‌హీరోయిన్‌గా చూడలేమా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆమె 'మిర్చి' తర్వాత మరలా అటువంటి చిత్రం చేయలేదు. ఆమె వయసు పై బడే కొద్ది ఆమె కేవలం కొన్ని తరహా పాత్రలకే సూట్‌ అవుతోంది. కుర్రస్టార్‌ హీరోలు ఆమెను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో ఇక త్వరలో అనుష్క కూడా రిటైర్‌మెంట్‌కి దగ్గరైందని, ఆమె ఇకపై రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రలు చేయలేదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి అనుష్క అనబడే స్వీటీ కెరీర్‌ ప్రస్తుతం చరమాంకంలో ఉందని అంటున్నారు.

Similar News