జూనియర్ ఎన్టీఆర్ అంధుడి పాత్రకు రెడీ అయ్యాడా?

Update: 2016-11-06 06:53 GMT

ఈ మధ్యన ఎన్టీఆర్ వేరు వేరు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అందరిని అలరిస్తున్నాడు, టెంపర్ దగ్గర నుండి ఎన్టీఆర్ స్టయిల్ లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. టెంపర్ లో నెగెటివ్ పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సూపర్ స్టయిల్ కొడుకుగా అలరించాడు. ఇక మొన్న వచ్చిన జనతా గ్యారేజ్ లో ప్రకృతి ప్రేమికుడిగా కనిపించాడు. ఇక ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ ఎన్టీఆర్ కెరీర్ కి హిట్ సినిమాలే. జనతా... రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ ఏదర్శకుడుతో సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. మొదట వక్కంతం వంశీ అనుకున్నప్పటికీ అది కుదరలేదు. ఇక పూరి కాంబినేషన్ అన్నారు అదీ పట్టాలెక్కలేదు. తర్వాత ఎన్టీఆర్ వి.వి వినాయక్, సురేంద్ర రెడ్డిల డైరెక్షన్ లో నటిద్దామనుకున్నాడు. అదీ కలిసి రాలేదు.

ఇక ఇప్పడు లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ విభిన్న కథతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. అందుకే చిన్న సినిమాల దర్శకులు చెప్పే కథలపై ఆసక్తి చూపుతున్నాడు అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ పటాస్ దర్శకుడు అనిల్ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాడనే ప్రచారం మొదలైంది. అయితే ఈ కథలో హీరో అంధుడి పాత్రలో కనిపిస్తాడట. ఇక ఎమోషన్స్ కలగలిపిన బలమైన కథ ఉండడం వల్ల ఈ కథ ఎన్టీఆర్ కి నచ్చిందని అంటున్నారు. కథపై ఉన్న నమ్మకం తో ఎన్టీఆర్ ఈ అంధుడి పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు ఇదే నిజమైతే ఎన్టీఆర్ డెసిషన్ అందరూ మెచ్చుకుని తీరుతారు. ఇక ఈ న్యూస్ ఇది అధికారికం గా బయటికి వచ్చే వరకు నమ్మడానికి లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆయా డైరెక్టర్స్ తో చేస్తున్నాడనే రూమర్స్ చాలానే వినబడ్డాయి. మరి నిజం గా ఎన్టీఆర్ దీనికి ఒప్పుకున్నాడా? లేక రూమరా అనేది తెలియాల్సి వుంది.

Similar News