చైతూ సినిమాకు డీఎస్పీ సంగీతం

Update: 2016-11-21 15:45 GMT

ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా తనకంటూ సరైన హిట్ లేకుండా అలమటిస్తున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నాగార్జునకు, దర్శకుడిగా తన తొలి చిత్రంతోనే మంచి మసాలా హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణపై అక్కినేని ఫామిలీ కాన్ఫిడెన్స్ పెంచుకున్నట్లుంది. అందుకే తొలి సినిమా సోగ్గాడే చిన్ని నాయనా తరువాత, రెండో చిత్రానికి చైతూ డేట్స్ ఇచ్చాడు. ఇదికూడా ఒక ఆంగ్ల చిత్రం ఆధారంగా మార్పుచేర్పులతో కథ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాజా ఖబర్ ఏమిటంటే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చైతూ ఈసారి హిట్ కొట్టడానికి ఇలాంటి మసాలా కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది.

Similar News