గౌతమ్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు!!

Update: 2016-11-06 09:19 GMT

క్రియేటివ్‌ జీనియస్‌.. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌... ఈయన దర్శకత్వంలో నటించాలని కోలీవుడ్‌ స్టార్స్‌ మాత్రమే కాదు... టాలీవుడ్‌లోని పలువురు స్టార్స్‌ ఆయన దర్శకత్వం వహించే చిత్రాలలో నటించాలని ఆశపడుతుంటారు. ఆయన చేస్తానంటే డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడానికి కూడా సిద్దపడుతుంటారు. కాగా గౌతమ్‌ ప్రస్తుతం తమిళంలో, తెలుగులో తీసిన నాగచైతన్య, శింబు, మంజిమామోహన్‌ ద్విభాషా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాన్ని ఈనెల 11న రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేసే బిజీలో ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ధనుష్‌తో తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆయన తెలుగు, తమిళభాషల్లో ఒకే హీరోతో ఓ చిత్రం చేయనున్నాడు. ఆయన రెండు భాషల్లో చేసే చిత్రాలలో హీరోయిన్‌లు, ఇతర నటీనటులు కామన్‌గానే ఉన్నప్పటికీ హీరోలు మాత్రం మారుతుంటారు. కానీ ఈ సారి మాత్రం ఆయన తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి నటించబోయే హీరో మరెవరో కాదు... నాని. నానితో గతంలో గౌతమ్‌ 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రం చేశాడు. ఈచిత్రం ఫ్లాప్‌ అయింది. అయినా కూడా ఆయన తన తదుపరి చిత్రానికి తన ఫ్లాప్‌ హీరోనే తీసుకున్నాడు. గౌతమ్‌ ధనుష్‌తో చిత్రం చేసేలోపు నాని కమిట్‌ అయిన 'నేను..లోకల్‌', శ్రీ అవసరాల చిత్రాలు పూర్తవుతాయి. కాగా ఈ చిత్రం కోసం ఇప్పటి నుండే నాని పెద్ద స్కెచ్‌ వేస్తున్నాడట.

Similar News