కేవలం కొద్దిమంది మాత్రమే

Update: 2017-09-14 12:00 GMT

టాలీవుడ్ లో అందమైన ప్రేమికుల జంటగా పేరుపొందిన నాగ చైత‌న్య‌, స‌మంత‌ల వెడ్డింగ్‌కి అతిథుల లిస్ట్ ఆల్రెడీ పూర్త‌యింది అంటున్నారు. గోవా లో అక్టోబర్ 6 న జరగబోయే ఈ పెళ్ళికి ఇప్పటికే కావాల్సిన అతిథులంద‌రికీ పెళ్లి పత్రిక‌లు అందాయి అంటున్నారు. కేవ‌లం 150 మందిని మాత్రమె అక్కినేని ఫ్యామిలీ ఈ పెళ్ళికి ఆహ్వానించినట్టుగా చెబుతున్నారు. నాగ చైత‌న్య‌, స‌మంత కుటుంబ స‌భ్యులు వారిద్ద‌రికీ చెందిన చాలా దగ్గరి వారికి మాత్ర‌మే పెళ్లి పిలుపు అందింది అని టాక్.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్‌తో గోవాలోని ఒక రిసార్ట్‌లో అక్టోబ‌ర్ 6, 7 తేదీల్లో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల్లో వీరి పెళ్లి జ‌రుగుతుంది. బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఎటువంటి హంగామా, హడావిడి లేకుండా ఆనందంగా పెళ్లి వేడుకలు జ‌రుపుకోవాల‌నేది సమంత కోరిక‌ట‌. అందుకే నాగార్జున కూడా సమంతా కోరిక మేరకు ఇలా ప్లాన్ చేసాడట. ఒకవేళ హైద‌రాబాద్‌లో పెళ్లి అయితే పెళ్లి వేడుక‌ల‌ను ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉండ‌దు. మొత్తం గెస్ట్‌లంద‌రూ వ‌రుస‌గా క్యూ క‌డుతారు. అంద‌రితో ఫొటోలు దిగేసరికి తెల్లారుతుంది. ఇక సంబ‌రంగా ఎలా జ‌రుపుకోగ‌ల‌మ‌ని స‌మంత భావించింద‌ట‌.

ఇక నాగార్జున కూడా నాగ చైతన్య - సమంత ల పెళ్లి విషయంలో కాస్త కాంప్రమైజ్ అయినా రిసెప్షన్ విషయంలో తగ్గేది లేదంటున్నాడు. పెళ్లి వేడుకలు అక్టోబర్ 6 , 7 తేదీల్లో గోవాలో పూర్తి అయిన తర్వాత 8 న హైదరాబాద్ చేరుకొని 10 న రిసెప్షన్ వేడుకలకు సిద్దమవుతుంది చైతు - సామ్ ల జంట. ఇక ఈ రిసెప్షన్ వేడుకలకు నాగార్జున, సినీ స్నేహితులతోపాటు, రాజకీయ, వ్యాపారరంగ మిత్రులు కూడా హాజరవుతారని... అంటున్నారు. ఇక ఈ రిసెప్షన్ కోసం నాగార్జున ఇప్పటికే అందరికి ఆహ్వానాలు పంచుతున్నట్టు తెలుస్తుంది.

Similar News