కాజల్ తర్వాత రకుల్‌కే మెగా భాగ్యం!

Update: 2016-10-14 07:28 GMT

మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత చిత్రంతో వెండి తెరకు పరిచయం ఐన నాటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక్క కాజల్ అగర్వాల్ని తప్ప మరే కథానాయికని రిపీట్ చెయ్యలేదు. నేహా శర్మ, జెనీలియా, తమన్నా, అమలాపాల్, ప్రియాంక చోప్రా, శృతి హాసన్, అమీ జాక్సొన్ వంటి కథానాయికలు అందరిని ఒక్కో చిత్రానికే సరిపెట్టాడు. కానీ కాజల్ అగర్వాల్ ని ఇప్పటికే మూడు చిత్రాలలో కథానాయికగా తీసుకున్నాడు. ఇండస్ట్రీ హిట్ మగధీరతో వీరి మొదటి చిత్రం ప్రకంపనలు సృష్టించింది. తర్వాత ఈ జంట కలిసి నటించిన నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాలు మోస్తరు ఫలితాలతోనే సరిపెట్టుకున్నాయి.

ఇప్పుడు కాజల్ అగర్వాల్ తరహాలోనే మరో కథానాయికను తన చిత్రాలలో రిపీట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఆమే బ్రూస్ లీ చిత్రంలో మొదటి సారి రామ్ చరణ్ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్. వేణు వెంటనే తాను ఎంచుకున్న తమిళ రీమేక్ ఐన ధ్రువ చిత్రంతో మళ్లి రకుల్ కె అవకాశం కలిపించాడు చెర్రీ. మగధీర వంటి భారీ విజయం తర్వాత ఆశించిన స్థాయి విజయాలు నమోదు చేయలేకపోయినా రామ్ చరణ్, కాజల్ జోడి, ఇప్పుడు బ్రూస్ లీ వంటి ఘోర పరాజయం తర్వాత రామ్ చరణ్, రకుల్ ల జోడి ఎటు వంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

తమిళంలో బ్లాక్ బస్టర్ ఐన తన్ని ఉరువన్ రీమేక్ ఐన ధ్రువ టీజర్ విడుదలై అంతర్జాలంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉంటుందో లేదో చూడాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

Similar News