ఏమిటి రాజమౌళి రమ్మన్నా వెళ్లదా!

Update: 2016-10-11 14:34 GMT

ఇంతమాటన్నది ఎవరా అనుకుంటున్నారా... అదే మన ఎక్సట్రా జబర్దస్త్ భామ రష్మీ గౌతమ్. ఈవిడగారికి ఒక్క జబర్దస్త్ ప్రోగ్రాం తోనే సుడి తిరిగి ఏకం గా హీరోయిన్ గా మారిపోయింది. ఇక బుల్లితెరమీద తన ఒంపుసొంపులతో, వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ...... చిన్న చిన్న బట్టలు వేసుకుని కుర్రకారుని తన వైపుకు తిప్పుకున్న రష్మీ... అటు వెండితెరమీద కూడా తన అందాల ఆరబోతతో హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు ఎటువంటి అంటే తనకెరీర్ ని మలుపు తిప్పే ప్రపోసల్ వచ్చినా కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్లనని అంటుంది. అంత గా జబర్దస్త్ తనకి పేరుని తీసుకొచ్చిందని అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ టీవీ జబర్దస్త్ ని వదులుకోనని ఖరాఖండిగా చెప్పేసింది.

అంతే కాదు దర్శకధీరుడు రాజమౌళి అంతటివాడు పిలిచి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానన్న జబర్దస్త్ ప్రోగ్రాం ని వదిలి వెళ్ళలేనని చెబుతుంది ఈ భామ. తనకెన్ని సినిమాల్లో నటించినా రాని పేరు ఒక్క ఈ టీవీ జబర్దస్త్ వల్లే వచ్చిందని అందుకే ఎంత మంచి ఆఫర్ని వదులుకోవడానకైనా సిద్ధమని అంటుంది. మరి రష్మీ రాజమౌళి పిలవక పోయినా ఇలా మాట్లాడిందంటే... ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందేమో అని ఇప్పటినుండే రాజమౌళిని ఇండైరెక్టుగా కాక పట్టే పనులు చేసేస్తుందని అంటున్నారు. లేకపోతె రాజమౌళి తన సినిమాలో ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ ఒదులుకుంటానని మాట్లాడుతుందా అసలు. అమ్మో రష్మీ చాలా ముదురు బాబోయ్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు జనాలు.

Similar News