ఎనర్జిటిక్ యువ హీరో అంధుడిగా నటిస్తున్నాడా?

Update: 2016-10-19 16:00 GMT

లఘు చిత్రాలతో నెటిజెన్లలో అసాధారణమైన గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్, చిత్ర పరిశ్రమలోకి దర్శకుడు కావాలనే కోరికతో వచ్చి అనూహ్యంగా ఉయ్యాల జంపాల చిత్రంతో నటుడు అయిపోయాడు. ఉయ్యాల జంపాల చిత్రంతో మొదలు సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్ ల వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. తరువాత వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రం కొంత నిరాశ పరిచినా, మంచు విష్ణు తో కలిసి చేసిన మల్టీ స్టార్రర్ ఈడో రకం ఆడో రకం మంచి విజయాన్ని సాధించి పరిశ్రమలో రాజ్ తరుణ్ కి సక్సెస్ఫుల్ హీరో ఇమేజ్ నిలబెట్టింది.

రచయిత వెలిగొండ శ్రీనివాస్ అఖిల్ వంటి ఘోర పరాభవం తరువాత, తానే దర్శకుడు కావాలని నిర్ణయించుకుని ఒక కథా సిద్ధం చేసుకున్నాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర వెలిగొండ చెప్పిన కథా విని ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ని ఎంపిక చేసుకున్నారు. రాజ్ తరుణ్ కి అనిల్ సుంకర తో వున్న మూడు చిత్ర ఒప్పందాలలో వంశి కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఒక చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుండగా ఇది రెండవ చిత్రం.

వెలిగొండ శ్రీనివాస్ కథలో కథానాయకుడి పాత్రదారి అంధుడు అని వినికిడి. ఇదే నిజం అయితే వాణిజ్య పరమైన చిత్రాలతో సక్సెస్ అందుకుంటున్న రాజ్ తరుణ్ కి ఈ పాత్ర పోషించటం గొప్ప సవాలే అవుతుంది.

Similar News