ఎట్టకేలకు రవితేజకు ఒక సినిమా

Update: 2016-11-01 04:24 GMT

గత ఏడాది సంపత్‌నంది చిత్రం 'బెంగాల్‌టైగర్ ' చిత్రం తర్వాత మాస్‌ మహారాజా రవితేజ మరో చిత్రం చేయలేదు. ఆయన వేణుశ్రీరాంతో ఒప్పుకున్న చిత్రం ఆగిపోయింది. కొత్త దర్శకులు చక్రితో పాటు మరో యువ దర్శకుడి దర్శకత్వంలో ఆయన చేస్తాడని భావించిన రెండు చిత్రాలు ఆగిపోయాయి. కాగా గత కొంతకాలంగా రవితేజ బాబి దర్శకత్వంలో చేయాల్సిన తాజా చిత్రం కూడా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రవితేజను పెట్టుకోవడానికి ఏ నిర్మాత కూడా సుముఖంగా లేడని, ఆయన చేయాల్సిన ప్రాజెక్ట్‌లను అదే జోనర్‌కు చెందిన సాయిధరమ్‌తేజ్‌, రాజ్‌తరుణ్‌ల వద్దకు వెళ్తున్నాయనే టాక్‌ మొదలైంది. కాగా ఈ వార్తలతో రవితేజ అభిమానులు బాధపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌కు వినడానికి సంతోషించే వారికి ఓ శుభవార్త.

రవితేజ తాజాగా యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. దర్శకునిగా తన మొదటి చిత్రం 'కార్తికేయ' ద్వారా పెద్ద హిట్‌ను కొట్టి, ఆ తర్వాత రీమేక్‌ 'ప్రేమమ్‌' వంటి చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి తెగించి, సంచలనం సృష్టించిన చందుమొండేటి ఇటీవల రవితేజకు ఓ స్టోరీ చెప్పాడని, వినగానే ఓకే చేసిన రవితేజ చిత్రం చందు మొండేటి దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తన మొదటి చిత్రం 'కార్తికేయ'ను డిఫరెంట్‌ జోనర్‌లో చేసిన చందు మోండేటి దర్శకత్వంలో ఉంటుందని సమాచారం. తాను నటించిన 'నా ఆటోగ్రాఫ్‌' చిత్రం రీమేక్‌ తెలుగులో ఫ్లాప్‌ అయినప్పటికీ అలాంటి ఛాయలే ఉన్న 'ప్రేమమ్‌' చిత్రాన్ని విజయవంతంగా, అభిమానులు సైతం మెచ్చేలా డైరెక్ట్‌ చేసిన చందుమోండేటి ప్రతిభకు ముగ్దుడైన రవితేజ ఈ అవకాశం ఇచ్చాడని, మరి ఇది రీమేకా? లేదా ఫ్రీమేకా? లేక స్ట్రెయిట్‌ చిత్రమా? అనేది తెలియనప్పటికీ హిందీ చిత్రం 'స్పెషల్‌ చబ్బీస్‌'కు ప్రీమేక్‌గా చెప్పుకుంటున్నారు. మరి ఈ చిత్రమైనా ఆయనకు సెట్స్‌పైకి వెళ్లుతుందా? లేదా? అనేది త్వరలో తేలుతుంది.

Similar News