కార్తికేయ మరియు ప్రేమమ్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంతో పాటు ఆయన స్క్రిప్ట్స్ కి గొప్ప గుర్తింపు వచ్చింది. నిఖిల్ తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపుతుంది. ఈ చిత్రం ప్యాక్డ్ కొంబో తరహా లో లవ్, కామెడీ, థ్రిల్లర్, హారర్, రొమాన్స్ అన్ని అంశాలు కలిగి ఉండి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుంది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి సంభాషణల రచయిత అబ్బూరి రవి అయినప్పటికీ చిత్రంలోని ఒక కీలక సన్నివేశానికి చందూ మొండేటి సహాయ పడ్డారు అంట. నిఖిల్ కి కార్తికేయ చిత్రం నుంచి చందూ తో వున్న సత్సంబంధాలు నెమరు వేసుకుంటూ నిఖిల్ ఈ విషయాన్ని బైట పెట్టారు. ప్రేమమ్ చిత్ర చిత్రీకరణలో ఎంతో బిజీగా వున్న రోజులలో అడిగిన వెంటనే రచన లో సహాకారం ఇవ్వటానికి చందూ మొండేటి తన అమూల్యమైన సమయాన్ని కేటాయించారు అని చందూ ని పొగడ్తలతో ముంచేశాడు నిఖిల్.