కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ తో తారక్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఒక్కసారిగా రెండింతలు పెరిగిపోయింది. గత ఏడాది వరకు 40 కోట్ల క్లబ్ లో వున్న తారక్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. అంతటితో తారక్ విజయ పరంపర ఆగలేదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వెర్షన్ 79 .5 కోట్లు వసూళ్లు చేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూడవ అతి పెద్ద హిట్ గా సంచలనం సృష్టించింది. ఈ విజయమే ఇప్పుడు తారక్ ని భయాందోళనలకు గురి చేస్తుంది. రాఖి, యమదొంగ, బృందావనం, బాద్షా, టెంపర్ చిత్రాలు ఆడినప్పటికీ తారక్ కెరీర్లో సింహాద్రి తరువాత జనతా గ్యారేజీతోనే భారీ విజయం దక్కింది. సింహాద్రి తరువాత పూరి జగన్నాథ్, వినాయక్, సురేందర్ రెడ్డి, బి.గోపాల్ వంటి దర్శకులతో పని చేసినా విజయం వరించలేదు. అందుకే ఈ సారి కథ, దర్శకుడి ఎంపికలో చాలానే జాగ్రత్తలు వహిస్తున్నాడు యంగ్ టైగర్.
ఇప్పటికే గోపీచంద్ మలినేని, వక్కంతం వంశి, పూరి జగన్నాథ్ వంటి పలువురు ప్రముఖులు చెప్పిన కథలను తిరస్కరించగా, పవర్ బాబీ చెప్పిన తొలి కథను కూడా తిరస్కరించాడు తారక్. రెండు వారాలు సమయం తీసుకుని బాబీ మరో కథ చెప్పగా తారక్ కన్విన్స్ అయ్యాడు అంట. దీనితో ఇంక బొబ్బయితో తదుపరి తారక్ చిత్రం ఖరారు అయిపోనట్టే అని వార్తలు కూడా వస్తున్నాయి. నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ స్వయానా చిత్రం అధికార ప్రకటన చేసినా ఇప్పుడు నమ్మలేని పరిస్థితి. బాబీ చిత్రం సెట్స్ పైకి వెళ్తేనే తారక్ తదుపరి చిత్రం పట్టాలెక్కినట్లు లెక్క. ఇప్పుడు తారక్ వున్న డైలామాకి ఒప్పొందం కుదుర్చుకున్న కథ అయినా చర్చల దశలోనే నిలిచిపోవచ్చు కూడా. పూరి, వక్కంతం ఇలా నిరాశ చెందినవారే కదా మరి.