ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నాచురల్ స్టార్ నాని స్నేహితుడిగా కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రను పోషించిన విజయ్ దేవరకొండ ఈ ఏడాది విడుదల ఐన పెళ్లి చూపులు చిత్రంతో సోలో హీరోగా తొలి ప్రయత్నం చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. అతి చిన్న సినిమా గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకట్టుకుంది పెళ్లి చూపులు చిత్రం. ఈ చిత్ర విజయంతో పలు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి విజయ్ దేవరకొండ కు అవకాశాలు వచ్చాయి.
విజయ్ దేవరకొండ తన ప్రస్తుతం రెండు చిత్రాల చిత్రీకరణ లో బిజీగా ఉండగా తన తదుపరి చిత్రానికి కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. యూ.వి క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్రం హారర్ కామెడీ జోనర్ కి చెందినదిగా సమాచారం. ఈ ఏడాది ఆఖిరిలో ఈ చిత్ర రెగ్యులర్ షెడ్యూల్ మొదలు కానుంది. విజయ్ దేవరకొండ సోలో హీరోగా నటిస్తున్న తొలి ప్రముఖ నిర్మాణ సంస్థ యూ.వి.క్రియేషన్స్ కావటం గమనార్హం. హారర్ కామెడీ ల జోరు తాగిపోతున్న తరుణంలో యూ.వ్.క్రియేషన్స్ వారు ఈ చిత్రం నిర్మించటం కూడా చర్చనీయాంశం ఐయ్యింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ద్వారకా విడుదలకు సిద్ధం అవుతుండగా, అర్జున్ రెడ్డి అనే మరో చిత్రం చిత్రీకరణ దశలో వుంది.