ఈ కళ కూడా ఉందా... దేవిశ్రీ బాబు!!

Update: 2016-11-05 06:56 GMT

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చెయ్యడమే కాదు మంచి సింగర్ కూడా. ఒక మ్యూజిక్ ఏమిటి డాన్స్ కూడా ఇరగదీసేస్తాడు దేవిశ్రీ. తన సాంగ్స్ కి తానె స్టెప్స్ వేసుకుంటూ కుర్రకారుని ఊపేస్తుంటాడు. డాన్స్ చేస్తూ పాట పాడుతూ అబ్బో దేవి ముందు మామూలు హీరోలు కూడా పనికి రారంటే నమ్మండి. అంతలా రెచ్చిపోతాడు స్టేజి ఎక్కాడంటే. ఇన్ని కళలున్నా దేవి ఇప్పుడు కెమెరామన్ అవతారం కూడా ఎత్తాడట. ఇంతకుముందే దేవిశ్రీ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ని ఫోటో షూట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ ఫొటోస్ ఎంతలా తీస్తాడో దేవి కూడా అంత బాగా ఫొటోస్ తీసాడు.

ఇక ఆ ఫొటోస్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. మళ్ళీ ఇపుడు దేవిశ్రీ మరో హీరోయిన్ ని కొత్త యాంగిల్ లో తన కెమెరాలో బందించాడట. ఆమె తెలుగులో నారా రోహిత్ తో బాణం సినిమా చేసిన వేదిక. అయితే వేదిక తెలుగులో పెద్ద పాపులర్ అవలేకపోయింది... కానీ కోలీవడ్, మాలీవుడ్ మూవీస్ లో మాత్రం నటిస్తుంది. ఇక దేవిశ్రీకి వేదిక ఎలా నచ్చిందో కానీ మాంచి ఫోటో షూట్ చేసాడట. ఇక ఈ ఫోటో షూట్ సూపర్ గా ఉందని వేదిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి దేవిశ్రీ ఒక పక్క మ్యూజిక్ తో బిజిగా ఉంటూనే మరో పక్క తన సరదాలు ఇలా తీర్చేసుంటున్నాడన్నమాట. ఇక దేవిశ్రీ తన తదుపరి ఫోటో షూట్ కోసం ఏ హీరోయిన్ ని ఎంచుకుంటాడో చూడాలి.

Similar News