ఇప్పటితరం హీరోలకు అసలు బుద్దే లేదంట!!

Update: 2016-11-21 10:02 GMT

ఈ మాటన్నది ఎవరో కాదు సీనియర్ నటుడు చంద్రమోహన్. ఇప్పటి తరం హీరోలకు అసలు ఏం తెలియదని అన్నారు. వీరంతా ఎంతో గొప్పనటులమని ఫీలవుతారని కానీ వారికి అస్సలేం తెలియదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పటివరకు 800 లు పైగా సినిమాల్లో నటించానని... . తన 50 ఏళ్ళ సినీజీవితం తనకు సంతృప్తినిచ్చిందని నిన్నఆదివారం ఏలూరులో జరిగిన వనమోహోత్సవ కార్యక్రమం లో ఆయన మీడియా తో మాట్లాడారు. రంగులరాట్నం, సువర్ణనంది చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయని అప్పటి తియ్యని జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేనని అన్నారు. ఇక ఆయన ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ఇప్పుడు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని.... ఈ తరం హీరోలు ఎన్టీఆర్‌, అమితాబచ్చన్‌ల మాదిరి తెగ ఫీల్‌ అయిపోతూ తామేదో సాధించేశామనే ధోరణిలో ఉన్నారని అన్నారు. అసలు సీనియర్ నటుల్ని ఏమాత్రం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇప్పుడు వస్తున్న సినిమాలు అశ్లీలత, ఫైట్స్, కామెడీ అంటూ రొటీన్ కథలుగానే ఉంటున్నాయని.... కామెడీ కి పెద్దగా చోటు లేకుండా పోయిందన్నారు. అసలు ఈ రోజుల్లో సినిమాలు 100 రోజులు ఆడడమే గగనం అయిపోయాయని.... కనీసం రెండు వారాలు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. ఇక ఆర్టిస్టుగా క్యారెక్టర్లు కూడా దొరకడం లేదన్నారు. ఇప్పుడొస్తున్న కేరెక్టర్స్ తనకసలు తృప్తినివ్వడం లేదన్నారు. చంద్ర మోహన్ మాదిరిగానే ఆ మధ్యన ప్రస్తుత సినిమా పరిశ్రమ పరిస్థితులపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఆవేదనను వెళ్లగక్కిన విషయం తెలిసిందే

Similar News