ఇది ఆ దర్శకుడి బౌన్స్ బ్యాక్ 

Update: 2016-11-18 15:45 GMT

ప్రస్థానం చిత్రం ఆర్ధిక పరంగా అధిక లాభాలు చేయనప్పటికీ దర్శకుడు దేవా కౌశిక్ కట్ట కు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారిలో గుర్తింపు సాధించి పెట్టింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం వెన్నెల కూడా యువత మన్ననలు పొందిన చిత్రమే. కాగా ఆయన ప్రస్తానం కన్నా కూడా ఎన్నో రెట్లు బలమైన కథ అని నమ్మి రాసి, తీసిన ఆటోనగర్ సూర్య చిత్రం మిస్ ఫైర్ కావటం, తమిళ హిట్ చిత్రాన్ని డైనమైట్ పేరుతో రీమేక్ చేసి వైఫల్యం చెందటం, ఒక్కో చిత్రానికి మధ్య ఎక్కువ గ్యాప్ రావటం వంటి కారణాల చేత దేవా కట్ట ట్రాక్ తప్పినట్లుగా కనిపించారు.

అయితే ఒక్కో చిత్రానికి మధ్య ఆయన తీసుకునే గ్యాప్ కి కారణం తో పాటు ఆయన వ్యాపార లక్ష్యాలను ఆయన వెల్లడించాడు. "ఇటీవల ఎక్కువ వాణిజ్య ప్రకటనలు దర్శకత్వం వహిస్తూ బిజీ కావటం, నాకు కథ రాసే ప్రాసెస్ ఎప్పుడూ ఎక్కువ సమయం తీసుకోవటంతో నా చిత్రాలకు గ్యాప్ వస్తుంది. కథ సిద్ధం చేస్తూనే, వాణిజ్య ప్రకటనలతో పాటు సినిమాల విజయాపజయాలకతీతంగా ఆదాయం స్థిరత్వం చేసుకొనే క్రమంలో మీడియా కంపెనీ ప్రారంభించే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. మార్కెట్ లో ఒక రెపుటేడ్ కంపెనీతో టై అప్ ఐయి చేస్తున్న ప్రయత్నం ఇది. త్వరలోనే ఆ వివరాలు మీకు అందుతాయి. ప్రస్తుతం నేను చేస్తున్న కథ నా గత రీమేక్ లా కాకుండా నా శైలిలో సాగే కథ. ఈ సినిమా వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాను." అని ఆయన భవిషత్ ప్రణాలికను ఒక్కొక్కటిగా బైట పెట్టారు దేవా కట్ట.

Similar News