అల్లు వారి ఇంట ఆనందోత్సాహాలు

Update: 2016-11-22 07:07 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొంత కాలం కిందట ఆయన శ్రీమతి స్నేహ రెడ్డి రెండవ సారి గర్భం దాల్చిన సంగతి సోషల్ మీడియా ద్వారా తన తనయుడు అయాన్ స్నేహ రెడ్డి కడుపుని కిస్ చేస్తుండగా అల్లు అర్జున్ అయాన్ ని ఎత్తుకున్న ఫోటో తో అభిమానులతో పంచుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాగా నిన్న(సోమవారం) సాయంత్ర వేళలో స్నేహ రెడ్డి ఆడ పిల్ల కు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

"ఒక కొడుకు, ఒక కూతురు. ఇంకేం కోరుకోవాలి?? నేను చాలా అదృష్టవంతుడిని. ఒక కొడుకు తరువాత ఒక కూతురు పుట్టటం చాలా ఆనందంగా వుంది. మీ అందరి విషెస్ కి నా మానసపూర్వక కృతజ్ఞతలు. ఈ ఆనంద సమయాన్ని మీతో పంచుకోవటం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది." అని ట్వీట్ చేసాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2017 వేసవికి విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Similar News