'విన్నర్' సినిమాని గత కొన్ని రోజులుగా గోపీచంద్ మలినేని రాత్రిళ్ళు తెరకెక్కిస్తున్నాడు. ఇక రాత్రిళ్ళు షూటింగ్ లో పాల్గొంటున్న సాయి, వెన్నెల కిషోర్ కామెడీ డైలాగ్స్ తో మాట్లాడుకున్నట్టు ఉన్న ఫోటో వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఆ ఫొటోలో 'రేపు కూడా నైట్ షూటింగ్ అంట... చచ్చాం పో అని సాయి, వెన్నెల కిషోర్ మాట్లాడుకుంటుండగా. ... డైరెక్టర్ గోపీచంద్ వచ్చి.. ఎల్లుండి నైట్ షూటింగ్.. ఓకే కదా' అని అడగడం తో భలే జోక్ గా అనిపిస్తుంది. మరి ఇంత ఉల్లాసం గా 'విన్నర్' షూటింగ్ జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుంది కదూ. ఇక ఈ 'విన్నర్' సినిమాలో సాయి ధరమ్ తేజాకి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా... హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ లో సాంగ్ లో ఆడి పాడనుందట.