మహేష్, మురుగదాస్ డైరెక్షన్ చేసే సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల సినిమాకి ఒకే చేసిన విషయం తెలిసందే. ఈ సినిమా ఎప్పుడో ఫైనల్ అయిపొయింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులు కొరటాల పూర్తిచేస్తున్నాడు. నటీనటుల ఎంపిక దగ్గరనుండి టెక్నీషియన్స్ వరకు కొరటాల దగ్గరుండి చూసుకుంటున్నాడట. అయితే కొరటాల - మహేష్ చిత్రం పై ఒక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అదేమిటంటే మహేష్ తో కొరటాల చెయ్యబోయే చిత్రం ఒక మల్టి స్టారర్ గా తెరకెక్కిస్తున్నాడని ఆ రూమర్ సారాంశం. ఆ మల్టి స్టారర్ లో మహేష్ తో పాటు బాలకృష్ణ నటిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే విపరీతమైన అంచనాలున్నాయి.
ఇక ఈ న్యూస్ తో మరింత భారీ అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి. అయితే ఈ న్యూస్ ని అందరూ నమ్మేశారు. ఎందుకంటే బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం వచ్చే సంక్రాంతికి కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్ - మురుగదాస్ సినిమాకూడా మార్చిలో విడుదలకు సిద్ధమవుంతుంది. ఇక వీరి ప్రస్తుత సినిమాలు పూర్తయ్యాక వీరు కొరటాల డైరెక్షన్ లో నటిస్తారని అనుకున్నారు. కానీ ఈ వార్తలని కొరటాల శివ కొట్టిపారేశాడు. తాను మహేష్ తో చెయ్యబోయే సినిమాలో ఎటువంటి క్రేజీ కాంబినేషన్స్ ఉండవని... మల్టి స్టారర్ అసలే ఉండదని పూర్తి క్లారిటీ ఇచ్చేసాడు. తన సోషల్ మీడియా పేజీ లో పై విధం గా అందరికి ఈ క్లారిటీ ఇచ్చాడు. ఇంకా పుకార్లను నమ్మొద్దని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాని పోస్ట్ చేసాడు. ఇక కొరటాలా ఈ మహేష్ చిత్రం పై ఫుల్ క్లారిటీ ఇచ్చాక ఈ మల్టి స్టారర్ లో బాలకృష్ణ, మహేష్ నటించడం లేదని అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారట..