తమిళ తెలుగు భాషల్లో కెరీర్ ప్యాక్స్లో ఉండగా దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను ఆమె 23 ఏళ్ళ వయసులో వివాహమాడి ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచారు అమల పాల్. ఇటీవల ఆవిడ భర్త ఎ.ఎల్.విజయ్ తో విదుకాలు చేసుకుంటున్నట్లు ప్రకటించి మళ్లీ అందరిని ఆశ్చర్య పరిచింది అమల పాల్. ఎ.ఎల్.విజయ్ తో అమల పాల్ దాంపత్య జీవితం కేవలం రెండు సంవత్సరాలకే ముగిసిపోయింది. విడాకులు తరువాత ఫోటో షూట్స్, లాంగ్ టూర్స్ అంటూ ఎప్పుడు ప్రేక్షకుల నోర్లలో ఆవిడ పేరు నానేలా జాగ్రత్త పడుతుంది అమల పాల్.
తాజాగా ఒక తమిళ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భర్త తో విడిపోయిన సందర్భం ప్రస్తావనకు రాగా, "నాకు ఇప్పటికి విజయ్ పై ప్రేమ వుంది. ఈ ప్రేమ జీవితాంతం ఉంటుంది. విజయ్, మరియు ఆయన తల్లి తండ్రులు పెట్టె షరతులకు ఇమడలేక నేను విడాకులు కోరుకున్నా. అందరూ అనుకుంటున్నట్లు 23 ఏళ్లకే వివాహం చేసుకోవటం తప్పు అని నేను భావించటం లేదు. సరైన సమయంలోనే నా వివాహం జరిగింది అని నమ్ముతున్నా. నాకు జీవితంలో కఠిన నిర్ణయాల కి మంచి చెడ్డలు చెప్పి గైడ్ చేజేసే వారెవరు లేరు. నా కాలం నేర్పే గుణపాఠమే అనుభవాన్ని ఇస్తుంది." అని స్పందించింది అమల పాల్.