అన్ని ఒకేసారా!!

Update: 2016-11-20 16:38 GMT

మోదీ కరెన్సీ మార్పిడి నిర్ణయంతో కొత్త సినిమాలు రిలీజ్‌ చేయడానికే నిర్మాతలు భయపడుతున్నారు. కానీ సినిమా మీద ఉన్న నమ్మకంతో మాత్రం కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు డేర్‌గా విడుదల చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో', నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాల ఓపెనింగ్స్‌పై సామాన్యుడి కరెన్సీ కష్టాల ఎఫెక్ట్‌ పడుతూనే ఉంది. అయినప్పటికీ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఫర్వాలేదనిపిస్తుంటే, నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి మౌత్‌టాక్‌తో పాటు రివ్యూలు, విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఈ చిత్రానికి మొదటి రోజు బాగానే కలెక్షన్లు వచ్చాయని ఒకటిన్నర కోటి నుండి రెండు కోట్ల వరకు కలెక్షన్లను తొలిరోజు ఈ చిత్రం రాబట్టిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కమెడియన్‌ నుండి హీరోగా మారి శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించిన 'జయంబు నిశ్చయంబురా' చిత్రం కూడా 25వ తేదీనే విడుదలకు సిద్దమవుతోంది. దీంతో ఈ చిత్రంలో కూడా దర్శకనిర్మాత అయిన శివరాజ్‌ కనమూరికి, శ్రీనివాసరెడ్డికి కూడా తమ చిత్రంపై ఎంతో నమ్మకం ఉండటంతోనే ఇంత సాహసానికి దిగుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ కమెడియన్‌ హీరోగా ఏ మాత్రం సత్తా చూపిస్తాడో వేచిచూడాల్సివుంది....!

Similar News