అందుకు నేను సిద్ధం అంటున్న రజనీకాంత్

Update: 2016-11-21 20:17 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే చిత్రం కోసం పని చెయ్యటం కానీ, ఇద్దరు కలిసి ఒకే చిత్రాన్ని ప్రమోట్ చెయ్యటం కానీ మన దగ్గర చాలా అరుదు. కాని స్టార్ స్టేటస్ వున్న హీరోల మధ్య కూడా పరస్పర ప్రోత్సాహాలు అందుతుంటాయి బాలీవుడ్ లో. అక్కడ ముల్టీస్టారర్లు కూడా ఏటా డజన్ పైగా విడుదల అవుతుంటాయి. ఈ ఆరోగ్య కరమైన వాతావరణానికి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఐన ఖాన్ ల త్రయం కూడా ముందు అడుగు వేస్తుండటం విశేషం. ఇక వారిలో సల్మాన్ ఖాన్ అయితే పరిధి ధాటి చిన్న కథానాయకుల నుంచి అగ్ర తారల వరకు అందరి చిత్రాలను ప్రమోట్ చేసే బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుంటున్న సందర్భాలు ఇటీవల అనేకం తారసపడ్డాయి.

సల్మాన్ ఖాన్ కి సమకాలీన తోటి నటుడు ఐన అక్షయ్ కుమార్ ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ 2 .0 చిత్రంలో ప్రతి నాయకుని పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై నగరంలో జరిగిన ఈ చిత్ర పోస్టర్ విడుదల కార్యక్రమానికి అతిధిగా హాజరు ఐన సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ కి అభినందనలు తెలుపుతూ, అదే పనిగా రజని కాంత్ పై తనకి వున్న మమకారాన్ని చాటుకున్నాడు. వసూళ్ల విషయంలో రజని కాంత్ కి చేరువ అవుతున్నారని విలేకరులు ప్రస్తావించగా, "రజని కాంత్ గారి క్రేజ్ ని, కలెక్షన్స్ ని అందుకోవటం నాలాంటి అతి సామాన్య నాయుడుకి అసంభవం. అందుకే నేను వాటి కోసం ప్రయత్నం చెయ్యను." అని చెప్పాడు సల్మాన్.

అనంతరం రజని కాంత్ సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ ఆయన హోదాని ఆయనంతట ఆయనే తగ్గించుకుని సల్మాన్ ఖాన్ ఆయనకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆయన చిత్రంలో ఒకసారి అయినా నటిస్తానని పేర్కొన్నారు రజని కాంత్.

Similar News