అంత మెతక హీరోకు అసలు గొడవెలా వచ్చిందబ్బా?

Update: 2016-10-25 12:17 GMT

నటులు, దర్శకులు, నిర్మాతలకు చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదం వారిని వెంటాడుతూనే ఉంటుంది. వెంకటేష్ లాంటి ఒకరో ఇద్దరో నటులు సినిమా కుటుంబం నుంచి వచ్చి మూడు దశాబ్దాలు పైగా నట జీవితం సాగిస్తున్నా వివాదాలకు కాస్త దూరంగా ఉంటుంటారు. అటువంటి కోవకే చెందుతాడు హీరో గోపి చంద్. ఎప్పుడైనా వచ్చే పుకార్లు తప్ప ఆయనను వార్తల్లో ఉంచే వివాదం అంటూ ఏదీ ఉండదు. అటువంటి హీరో సెట్స్ పై ఉన్న సినిమా దర్శకుడితో అభిప్రాయం భేదాలు ఏర్పడి చిత్రీకరణ ఆలస్యం అవుతుంది అంటే వినటానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

గోపి చంద్ ప్రస్తుతం ఏ.ఎం రత్నం నిర్మాణం లో ఆయన తనయుడు ఏ.ఎం జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆక్సిజన్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రణాళిక ప్రకారం అయితే ఈ చిత్రం అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. కానీ అనివార్య కారణాల వలన చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ విషయంలో హీరో దర్శకుడి మధ్య అభిప్రాయం భేదాలు తార స్థాయికి చేరటంతో గోపి చంద్, జ్యోతి క్రిష్ణ ఒకరినొకరు చూసుకోవటానికి కూడా ఇష్ట పడటం లేదు అంట. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం ఈ మనస్పర్థలు సర్ది చిత్రం విడుదల చెయ్యటానికి శ్రమిస్తున్నారంట.

గోపి చంద్ ప్రతి ఏడాది రెండు విడుదలలు ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఈ ఏడాది ఆయనకీ బి.గోపాల్ చిత్రం మధ్యలో ఆగిపోయి ఇప్పుడు మొదలుకావటం, ఆక్సిజన్ దర్శకుడితో మనస్పర్థల వలన ఈ ఏడాది అనుకున్నా విడుదలలు వాయిదా పడుతూ వున్నాయి.

Similar News